Radhe Shyam Collections: కలెక్షన్లలో రాధేశ్యామ్​ రికార్డు- మొదటి రోజు ఎంతంటే?

Radhe Shyam Collections: రాధేశ్యామ్​ మూవీ ప్రపంచపవ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన మూవీ కావడంతో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తొలి రోజు ఈ మూవీ కలెక్షన్స్ ఎన్నంటే..!

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2022, 08:26 PM IST
  • థియేటర్లలో రాధేశ్యామ్ సందడి
  • తెగ ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్​
  • కాసుల వర్షం కురిపిస్తోందని అంచనాలు
Radhe Shyam Collections: కలెక్షన్లలో రాధేశ్యామ్​ రికార్డు- మొదటి రోజు ఎంతంటే?

Radhe Shyam Collections: ప్రభాస్, పూజా హీరో, హీరోయిన్లుగానటించిన రాధేశ్యామ్​ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు విడుదలవ్వడంతో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేశారు. ప్రపంచవ్యాప్తంగా 7000 వేలకు పైగా స్క్రీన్​లలో ఈ మూవీ విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ అంచనాలను అందుకుందా? మొదటి రోజు కలెక్షన్స్ ఎంత? అనే వివరాలపై సినీ విశ్లేషకుల అంచనాలు ఇలా ఉన్నాయి.

కలక్షన్స్ డేటా..

సినీ విశ్లేషకుల ప్రకారం..  తెలుగు రాష్ట్రాల్లో రాధేశ్యామ్ రికార్డు వసూళ్లు నమోదు చేసినట్లు తెలిసింది. అన్ని భాషల్లో కలిపి ఈ మూవీ మొదటి రోజు రూ.48 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా రూ.32 కోట్లుగా అంచనాలున్నాయి. నైజాంలో ఆల్​ టైం రికార్డు స్థాయి అయిన రూ.15.50 కోట్ల వసూళ్లు సాధించినట్లు సినీ వార్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇక హిందీలో రాధేశ్యామ్ తొలిరోజు రూ.2.50 కలెక్షన్లు రాబట్టిందని సినీ బజ్​ వినిపిస్తోంది.

ఇక ఇఫ్పటిపకే రాధే శ్యామ్​ మూవీ శాటిలైట్​ రైట్స్​ను రూ.100 కోట్లకు అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి. ఓటీటీ రైట్స్​పై ఇంకా సమాచారం లేదు. అయితే ఈ రైట్స్​ కూడా భారీ రేటుకు అమ్ముడయ్యే అవకాశాలున్నాయి.

నోట్​: మొదటి రోజు కలెక్షన్లపై సినీ వర్గాలు, సినీ విశ్లేషకుల అంచనాల ప్రకారం మాత్రమే ఈ గణాంకాలు చెప్పడం జరిగింది.

Also read: Cheating Case: నిర్మాత బెల్లంకొండ సురేష్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌లపై చీటింగ్ కేసు..

Also read: Mamta Mohandas: చీరకట్టులో చిలిపి చూపుల మమతా మోహన్​దాస్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News