Pushpa song : పుష్ప సమంత సాంగ్‌కు మేల్‌ వెర్షన్...ఊ అంటావా పాప.. ఊఊ అంటావా పాపా పాట వైరల్..

Samantha song male version : ఊ అంటావా పాప.. ఊఊ అంటావా పాపా పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. పుష్ప సమంత సాంగ్‌కు మేల్‌ వెర్షన్ ఇది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఊ అంటావా ఊఊ అంటావా పాటపైనే డిస్కషన్.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 08:34 PM IST
  • పుష్ప మూవీలోని ఊ అంటావా మావ ఊఊ అంటావా మావా పాట మేల్ వెర్షన్
  • ఈ మాస్ ఐటెమ్‌ సాంగ్ ఇప్పడు హాట్ టాపిక్
Pushpa song : పుష్ప సమంత సాంగ్‌కు మేల్‌ వెర్షన్...ఊ అంటావా పాప.. ఊఊ అంటావా పాపా పాట వైరల్..

Pushpa Movie Samantha item song Oo Antava OoOo Antava male version video goes viral in social media: పుష్ప మూవీలోని ఊ అంటావా మావ ఊఊ అంటావా మావా పాటపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రచ్చ అవుతోంది. కొంతమంది ప్రేక్షకులకు ఈ మాస్ ఐటెమ్‌ సాంగ్ తెగ నచ్చేసింది. మరికొందరికేమో ఈ పాట అస్సలు నచ్చలేదు. 

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అంతా పుష్పలో మూవీలోని సమంత స్పెషల్‌ సాంగ్ ఊ అంటావా మావ ఊఊ అంటావా మావా (Oo Antava..Oo Oo Antava) పాట గురించే చర్చించుకుంటున్నారు. ఈ మధ్యే విడుదలైన ఈ సాంగ్ లిరికల్ వీడియో (Song Lyrical Video) యూట్యూబ్‌లో వ్యూస్ పరంగా సంచలనం రేపింది. అల్లు అర్జున్ (Allu Arjun) సరసన ఈ ఊర మాస్ పాటకు అంతే రేంజ్‌లో స్టెప్స్ వేసి అల్లకల్లోలం చేసింది సామ్ (Sam). ఇంత వరకు బాగానే ఉంది కానీ ఈ పాటను కొందరు చాలా పర్సనల్‌గా తీసుకున్నారు. 

మగజాతిని (MagaJaathi) కించపరిచేలా ఊ అంటావా మావ ఊఊ అంటావా మావా పాట ఉందంటూ కొందరు కోర్టు మెట్లు ఎక్కారు. పురుషుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ పాట ఉందంటూ పుష్ప మూవీ యూనిట్‌పై కేసు వేశారు. 

అంతేకాదు సోషల్ మీడియాలో (Social media) ఎక్కడ చూసినా ఇప్పుడు ఊ అంటావా ఊఊ అంటావా పాటపైనే డిస్కషన్ సాగుతోంది. ఈ పాట చరణాలపై అలాగే ఈ పాటలో సమంత (Samantha) నటించడంపై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఏం అమ్మాయిలు మాత్రం తక్కువున్నారా ఏంటి.. అంటూ ఊ అంటావా ఊఊ అంటావా పాటకు మేల్ వెర్షన్ (Male version) క్రియేట్ చేశారు మగరాయుళ్లు.

మీ మగబుద్దే వంకర బుద్ది అంటూ పుష్ప మూవీలోని ఐటెం సాంగ్‌లో (Pushpa movie Item song) ఉంది. అయితే.. మీ ఆడోళ్ల బుద్దే వంకర బుద్ది.. ఊ అంటావా పాప ఊఊ అంటావా పాప అంటూ సాగే ఒక సాంగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప మూవీలోని ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ పాటకు ( Oo Antava Oo Oo Antava song Male version)ఇది మేల్‌ వెర్షన్‌గా ట్రెండ్ అవుతోంది. 

Also Read : Inter Student Suicide Note: నా చావుకు మంత్రి కేటీఆర్ కారణం.. ట్విట్టర్‌‌లో తెలంగాణ ఇంటర్ విద్యార్థి సూసైడ్ నోట్ 

మాములుగా చాలా మూవీల్లోని సీన్లకు, పాటలకు స్ఫూఫ్స్ రావడం కామన్. కానీ పుష్ప మూవీ మేల్ వెర్షన్‌గా ట్రెండ్ అవుతోన్న ఈ పాటపై మాత్రం ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. ఈ పాటకు పలు మూవీల మషప్ చేసి మ్యూజిక్‌.. చరణాలకు తగ్గట్లుగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్‌గా మారింది. వాలి అనే ఖాతాతో ఈ పాట ట్విటర్‌‌ పోస్ట్ అయ్యింది. 

ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా పాటను పుష్ప మూవీలో ఫోక్‌ సింగర్‌ (Folk Singer) ఇంద్రావతి చౌహన్‌ (Indravathi Chauhan) పాడారు. హస్కీ వాయిస్‌తో ఇరగదీసేసింది ఇంద్రావతి. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోన్న మేల్‌ వెర్షన్‌ కు కూడా అంతే రేంజ్‌లో రెస్పాన్స్ లభిస్తోంది. ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మూవీ మరికొన్ని గంటల్లో అంటే రేపు ఉదయం.. డిసెంబర్ 17న (December 17) ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Also Read : Esha Gupta: బాత్రూంలో చరణ్ హీరోయిన్ రచ్చ.. అక్కడ చేయి పెట్టుకుని మరీ (వీడియో)!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News