Pushpa Day 1 Collection: అల్లు అర్జున్ 'పుష్ప' మూవీ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

Pushpa Day 1 Collection: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజు దక్కించుకున్న కలెక్షన్లు ఎంతో తెలుసుకుందాం!  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2021, 04:45 PM IST
Pushpa Day 1 Collection: అల్లు అర్జున్ 'పుష్ప' మూవీ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

Pushpa Day 1 Collection: లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన 'పుష్ప' చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభిస్తోంది. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 

సుకుమార్ దర్శకత్వం, బన్నీ నటన, సినిమాటోగ్రఫీతో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్​గా మారాయి. సమంత స్పెషల్ సాంగ్ కూడా థియేటర్లకు జనాల్ని రప్పించడంలో సఫలమైంది. దీంతో తొలిరోజే కలెక్షన్ల పరంగా దుమ్మురేపిందీ చిత్రం. 

నిజాం ఏరియాలో ఏకంగా తొలిరోజే 11.44 కోట్ల షేర్​తో ఆల్​టైమ్ రికార్డు సృష్టించింది 'పుష్ప'. ఈ విషయాన్ని చిత్రబృందం సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం, ఐదో షోకు పర్మిషన్, టికెట్ రేట్ల పెంపు భారీ కలెక్షన్లకు సహాయపడ్డాయి. 

అలాగే తమిళనాడులో తొలిరోజు ఈ చిత్రానికి 3.75 కోట్ల గ్రాస్ లభించిందని తెలుస్తోంది. కేరళలో 2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. సరైన ప్రమోషన్లు లేకపోయినా ఓ డబ్బింగ్ సినిమాకు ఇంతటి కలెక్షన్లు రావడం అద్భుతమనే చెప్పవచ్చు. 

అల్లు అర్జున్ 'పుష్ప'పై బాలీవుడ్​లో మంచి హైప్ ఏర్పడింది. దానికి కారణం బన్నీ నుంచి వచ్చిన చాలా చిత్రాలు యూట్యూబ్​లో దుమ్మురేపాయి. కానీ బన్నీ చిత్రాలు హిందీలో డబ్ కావడం ఇదే తొలిసారి. ప్రమోషన్స్ సరిగా లేకపోయినా, థియేటర్ల సీటింగ్ సామర్థ్యం 50 శాతమే ఉన్నా.. అక్కడ కూడా ప్రేక్షకుల్ని మెప్పించడంలో సఫలమయ్యారు సుక్కు-బన్నీ. దీంతో తొలిరోజే ఈ చిత్రానికి అక్కడ 3.1 కోట్ల వసూళ్లు రావడం విశేషం. శని, ఆదివారాల్లో ఈ కలెక్షన్లు మరింతగా పెరుగుతాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.   

Also Read: Radhe Shyam Pre Release : రాధేశ్యామ్‌ ప్రీరిలీజ్‌ వేడుక డేట్‌ ఫిక్స్.. ముఖ్య అతిథులు ఎవరో తెలుసా?

Also Read: Shyam Singha Roy Movie: శ్యామ్ సింగరాయ్ నుంచి మరో సర్ ప్రైజ్...నేటి సాయంత్రం 'ప్రణవాలయ' సాంగ్ రిలీజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News