Pushpa 2 The Rule: ఇంటర్నెట్‌లో పుష్ప 2 సినిమా లీక్‌..? 'వైల్డ్‌ ఫైర్‌'గా అల్లు అర్జున్‌ ఎంట్రీ

Allu Arjun Wild Entry In Pushpa 2 The Rule: సినీ పరిశ్రమ అల్లు అర్జున్‌ మేనియాతో ఊగిపోతుంది. ప్రేక్షకులతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్లు సోషల్‌ మీడియాలో షేక్‌ అవుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 4, 2024, 11:38 PM IST
Pushpa 2 The Rule: ఇంటర్నెట్‌లో పుష్ప 2 సినిమా లీక్‌..? 'వైల్డ్‌ ఫైర్‌'గా అల్లు అర్జున్‌ ఎంట్రీ

Pushpa 2 The Rule: ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ది రూల్‌ మేనియా నడుస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో జాతర నడుస్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా నటించిన పుష్ప 2కు కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభిస్తోంది. ప్రీమియర్‌ షోలకు అభిమానులు, ప్రేక్షకులు ఎగబడడంతో థియేటర్లు కిటకిటలాడాయి. ఇక థియేటర్‌లో అల్లు అర్జున్‌ ఎంట్రీ సీన్‌కు ప్రేక్షకుల ఈలలు, కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ప్రతి థియేటర్‌ వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Also Read: Pushpa 2 The Rule: అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌పై విరిగిన లాఠీ.. సంధ్య థియేటర్‌ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో పరిస్థితి కోలాహలంగా మారింది. టికెట్లు కొననివాళ్లు.. కొన్నవాళ్లు థియేటర్‌లోకి దూసుకురావడంతో థియేటర్‌ కిక్కిరిసిపోయింది. దీని కారణంగా సినిమాలోని డైలాగ్‌లు వినిపించలేదు. కానీ అల్లు అర్జున్‌ ఎంట్రీ సీన్‌కు థియేటర్‌ కాగితాలతో నిండిపోయింది. మరికొన్ని థియేటర్‌లలో బాణసంచా కాల్చారు. కొందరు పాలాభిషేకాలు చేశారు. మరికొందరు హారతులు పట్టారు. గుమ్మడికాయ తిప్పుతూ ఇలా తీరొక్ రీతిన అభిమానులు సందడి చేశారు.

Aslo Read: Naga Babu: అల్లు అర్జున్ కోసం రంగంలోకి నాగబాబు.. వెనక్కి తగ్గిన జనసేన పార్టీ

కాగా అల్లు అర్జున్‌ సినిమాలో ఎంట్రీ ఇచ్చిన సీన్ల వీడియోలతో సోషల్‌ మీడియా షేక్‌ అవుతోంది. ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ తదితర వాటిలో అల్లు అర్జున్‌ ఎంట్రీ సీన్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. థియేటర్‌లలో అభిమానులు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుండడంతో సినిమా లీకయినట్టు చిత్రబృందం భావిస్తోంది. ప్రేక్షకులు సినిమాను థియేటర్‌లలో రికార్డు చేయడం చిత్రబృందానికి తలనొప్పిగా మారింది. గొడ్డలి పట్టుకుని.. తలకు గుడ్డ కట్టుకుని అల్లు రఫ్‌ లుక్‌లో కనిపించాడు. దీంతో అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. సినిమా అదిరిపోయే రీతిలో ఉందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కొందరు మెగా అభిమానులను ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేస్తుండడంతో సోషల్‌ మీడియాలో అల్లు వర్సెస్‌ కొణిదెల అనేలా యుద్ధం జరుగుతోంది. ఏది ఏమైనా సినిమా మంచి టాక్‌ సొంతం చేసుకోవడంతో అల్లు అర్జున్‌ ఆర్మీ అభిమానులు సంబరాల్లో మునిగారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News