Prabhas in Vishnu Avatar: ఇదేం ట్విస్ట్ భయ్యా.. 'శ్రీమహా విష్ణు' అవతారంలో ప్రభాస్..!

Project K Updates: ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించి రోజుకో ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందులో డార్లింగ్ ప్రభాస్ శ్రీమహావిష్ణువుగా కనిపించబోతున్నట్లు సమాచారం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2023, 11:39 AM IST
Prabhas in Vishnu Avatar: ఇదేం ట్విస్ట్ భయ్యా.. 'శ్రీమహా విష్ణు' అవతారంలో ప్రభాస్..!

Prabhas in Vishnu Avatar?: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం ప్రాజెక్టు-కె. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి స్టార్లు నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్  బ్యానర్ పై సి. అశ్వినీ దత్ సుమారు రూ. 500 కోట్లుతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ భాగం కావడంతో దీనిపై అంచనాలు మరింత పెంచేశాయి. పైగా ఇందులో కమల్ విలన్ పాత్రలో నటించబోతున్నాడనే ఊహాగానాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ప్రభాస్, కమల్ ఢీ అంటే ఢీ అంటే వేరే లెవల్ ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా కథాంశంపై ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. ఇది ప్రధానంగా సైన్స్ ఫిక్షన్ కథ అయినప్పటికీ.. దీనికి ఫాంటసీ టచ్ కూడా ఇవ్వబోతున్నారట మేకర్స్. చెడుపై మంచి గెలుపు అనే యూనివర్సల్ పాయింట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుస్తున్నట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్, భారతీయ పురాణాలను మిక్స్ చేసిన విధానం సినిమాకే హైలైట్ గా నిలుస్తోందని సమాచారం.

Also read: Bro Movie: పవన్ కల్యాణ్ 'బ్రో' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. గెట్ రెడీ..!

ఈ సినిమాలో అమితాబ్, ప్రభాస్, కమల్.. ఈ ముగ్గురు సైంటిస్టులుగా కనిపిస్తారని.. ఈ సినిమాలో ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపిస్తారని మరో టాక్ వినిపిస్తోంది. ఈ కథను పురాణాలతో ముడిపెట్టే క్రమంలో కనిపించే విష్ణువు అవతారంలో ప్రభాసే కనిపించనున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా.. ఇప్పుడు పాన్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాగా నిలిచింది. మరోవైపు ప్రభాస్ నటించిన సలార్ మూవీకి రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. 

Also read: Samajavaragamana: శ్రీవిష్ణు ‘సామజవరగమన’ కలెక్షన్ల సునామీ.. తొలి వారం ఎంత వసూలు చేసిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News