Producer Ahiteja Bellamkonda ఓ సినిమా హిట్టయినా, ఫ్లాపయినా కూడా ఎక్కువగా దర్శకుడి ఖాతాలోకే ఆ క్రెడిట్ దక్కుతుంది. సినిమాకు హీరో ముఖ్యమే అయినా.. కథ అంత కంటే ముఖ్యం. కథ, కథనాలు సరిగ్గా ఉంటేనే సినిమా జనాల్లోకి వెళ్తుంది. కథ, కథనాలు లేకుండా ఏ స్టార్ హీరో నటించినా కూడా ఆ సినిమాను జనాలు పట్టించుకోరు. అసలే ఇప్పుడు ఆడియెన్స్ నిర్దాక్షిణ్యంగా సినిమాలను తిరస్కరిస్తున్నారు. సినిమా బాగుందని తెలిస్తే తప్పా.. థియేటర్లోకి రావడం లేదు.
ఆ హీరో, ఈ హీరోయిన్ అంటూ కాంబినేషన్ మీదే అందరూ దృష్టి పెడుతున్నారు. సినిమా కథ ఏంటి? కథనం ఎలా ఉంది.. అసలు బౌండెడ్ స్క్రిప్ట్ ఉందా? లేదా? అని కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సెట్స్‌లోనే సీన్స్ రాస్తున్నారు.. ఆ పద్దతి సరైంది కాదంటూ.. ఆ మధ్య చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దర్శకులంతా కూడా సెట్స్ మీద కథను వండేస్తున్నారు.. అక్కడే సీన్లను అల్లేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Dear Directors,
Please work on a script carefully and take enough time for pre production.
Don’t run behind the Heroes or Heroine dates and go to the sets un prepared.
Now a days every film is ur first film and you will be blamed first.
It’s not at all easy for a flop director to…— Ahiteja Bellamkonda (@ahiteja) May 16, 2023
మొన్నటికి మొన్న అనిల్ సుంకర కూడా పరోక్షంగా ఇదే విషయాన్ని చెప్పాడు. అసలు స్క్రిప్ట్ లేకుండానే సినిమాను స్టార్ట్ చేయడం తమ తప్పే అని అనిల్ సుంకర ఒప్పేసుకున్నాడు. ఇక ఇప్పుడు అఖిల్ సైతం ఆడియెన్స్‌కు క్షమాపణలు చెబుతూ ఓ లేఖను వదిలాడు. అందులో కనీసం దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు ఎక్కడా కూడా ప్రస్థావించలేదు. దీంతో అదొక పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇలా దర్శకులు కథ, కథనాల మీద ఫోకస్ పెట్టకపోవడంతోనే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
Also Read: Akhil Agent OTT : ఈ వారం ఓటీటీ థియేటర్ మూవీలు.. ఓటీటీలో అయినా అఖిల్ ఓకే అనిపిస్తాడా?
అక్షర సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన అహితేజ ఇప్పుడు శశివదనే అనే విలేజ్ లవ్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నాడు. ఈ యువ నిర్మాత తాజాగా దర్శకులందరికీ ఓ సూచన ఇచ్చాడు. ప్రీ ప్రొడక్షన్ పనులకు కావాల్సినంత టైం తీసుకోండి.. స్క్రిప్ట్‌ను జాగ్రత్తగా రెడీ చేసుకోండి.. హీరోలు, హీరోయిన్ల డేట్ల కోసం పాకులాడకండి.. ఏం ప్రిపేర్ అవ్వకుండా సెట్స్ మీదకు వెళ్లకండి.. ఇప్పుడున్న తరుణంలో ప్రతీ సినిమా మొదటి సినిమాగానే భావించండి.. ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయితే మొదటి నింద మీ మీదే పడుతుంది.. ఒక ఫ్లాప్ వచ్చాక.. మళ్లీ ఓ అవకాశం దొరకడం ఎంతో కష్టంగా ఉంటుంది అని అహితేజ మంచి సలహాను ఇచ్చాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook