Priya Anand: నిత్యానందతో ప్రియా ఆనంద్ పెళ్లి.. సింక్ కోసం రెడీ అంటున్న భామ!

Priya Anand Wants To Marry Nithyananda Swamy: మా నీళ్ల ట్యాంక్   వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2022, 11:37 AM IST
  • నిత్యానందతో ప్రియా ఆనంద్ పెళ్లి

    తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు

    సరదాగానే చేసిన వెంటనే వైరల్

Priya Anand: నిత్యానందతో ప్రియా ఆనంద్ పెళ్లి.. సింక్ కోసం రెడీ అంటున్న భామ!

Priya Anand Wants To Marry Nithyananda Swamy: తనను తాను భగవంతుడిగా ప్రకటించుకున్న నిత్యానంద స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఆయన ఒక సినీనటితో  జరిపిన రాసలీలలు వీడియోలు బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన దేశం మొత్తం మీద ఫేమస్ అయ్యారు. అనేక కేసులలో ముద్దాయిగా ఉన్న నిత్యానంద అనూహ్యంగా పోలీసుల కంటపడకుండా దేశం దాటిపోవడమే గాక ఈక్వేడర్ కి సంబంధించిన దీవులలో ఒక దీవి కొనుగోలు చేసి దానికి కైలాస దీవి అనే పేరు పెట్టి ఒక ప్రత్యేక దేశాన్ని ప్రకటించుకున్నాడు. 

ఆ దీవికి ప్రత్యేక కరెన్సీ ముద్రిస్తున్నారు. అయితే ఇంతటి వివాదాస్పద స్వామీజీకి కూడా వేల సంఖ్యలో భక్తులు అది కూడా దేశ విదేశాల నుంచి ఉన్నారు అంటే నమ్మక తప్పదు. అయితే అమాయకులు ఆయనను నమ్మారంటే అర్థం ఉంది కానీ తాజాగా ఒక పాపులర్ హీరోయిన్ ఆయనను వివాహం చేసుకోవాలి అనుకున్నట్లు వెల్లడించి కలకలం రేపింది. ఆ భామ ఎవరో కాదు లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియా ఆనంద్. ఆ సినిమా తర్వాత ఈ భామ రామ రామ కృష్ణ కృష్ణ,  180 వంటి సినిమాల్లో సందడి చేసింది. అలాగే కొన్ని తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా తెలుగువారికి బాగానే పరిచయమైంది. 

ఈ భామ ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. వరుడు కావలెను సినిమాతో దర్శకురాలిగా మారిన లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్ రూపొందింది. వెబ్ సిరీస్ లో సుశాంత్ కీలక పాత్ర పోషించగా అదే వెబ్ సిరీస్ లో ప్రియా ఆనంద్ కూడా ఒక కీలక పాత్రలో నటించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. అదేంటి అని ప్రశ్నిస్తే ఆయన గురించి ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నా సరే ఆయనను ఇప్పటికీ వేలాదిమంది భక్తులు ఆదరిస్తున్నారని,  ఆరాధిస్తున్నారని చెప్పుకొచ్చింది. 

అంతేకాక ఒకవేళ ఆయనను పెళ్లి చేసుకుంటే గనుక తన ఇంటి పేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. ఆయన పేరు నిత్యానందా అయితే తన పేరు ప్రియానంద అంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమె సరదాగానే ఈ వ్యాఖ్యలు చేసిందని భావిస్తున్నారు. ఎందుకంటే అంతటి వివాదాస్పద స్వామీజీతో వివాహం ఒకవేళ నిజంగా చేసుకోవాలి అనిపించినా ఇలా మీడియా ముఖంగా చెప్పడానికి ఎవరూ సాహసం చేయకపోవచ్చు కానీ ఆమె కేవలం వార్తల్లో నిలిచేందుకే ఈ కామెంట్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.\

Also Read: Urfi Javed: ఇలాంటి డ్రెస్ ఎప్పుడన్నా చూశారా.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే.. పరువాల వడ్డనకు ఇదో దారి!

Also Read: Vishnupriya: ఇదేందయ్యా ఇదీ.. మళ్లీ రెచ్చిపోయిన విష్ణుప్రియ.. కేవలం లోదుస్తులతో హాట్ ట్రీట్ ఇచ్చేసింది!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News