Chiranjeevi: చిరంజీవికి రెండుసార్లు నో చెప్పిన హీరో.. అది కూడా ఒక్క సినిమా కోసం

Chiranjeevi Movies: మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడం అంటే ఎగిరి గంతేసే వారు ఎంతోమంది. అలాంటిది చిరు తో మూవీకి నో చెప్పిన వారు ఉన్నారని మీకు తెలుసా? అవును అది కూడా ఒకసారి కాదు ఏకంగా రెండుసార్లు అవకాశాన్ని వదులుకున్నారు ఒక హీరో..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2024, 06:00 AM IST
Chiranjeevi: చిరంజీవికి రెండుసార్లు నో చెప్పిన హీరో.. అది కూడా ఒక్క సినిమా కోసం

Prithviraj Sukumaran: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. చిన్న పాత్రలు చేస్తూ.. క్రమంగా హీరోగా ఎదిగి.. ఎందరికో ఇన్స్పిరేషన్ గా మారిన నటుడు మెగాస్టార్. ఇండియాలో ఏ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్టిస్ట్ అయినా.. చిరంజీవితో సినిమా అంటే నటించడానికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఒక యాక్టర్ మాత్రం చిరుతో సినిమా చేయడానికి రెండు సార్లు నో చెప్పారు. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరో తెలుసా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ విషయం గురించి తాజాగా పృథ్వీరాజ్ వెల్లడించారు.

నటుడిగా, సింగర్ గా, వాయిస్ ఆర్టిస్ట్ గా, దర్శకుడిగా పలు పాత్రలు పోషించి అందరినీ మెప్పించిన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. సలార్ చిత్రంలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు పృథ్వీరాజ్. సలార్ చిత్రంతో ఇతనికి టాలీవుడ్ లో ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగింది. రీసెంట్ గా తనకు సంబంధించిన కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ చిరంజీవితో సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న విషయాన్ని  పృథ్వీరాజ్ చెప్పారు.

చిరంజీవి నటించిన హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఒక పాత్ర కోసం పృథ్వీరాజ్ ను సంప్రదించారట. ఆ చిత్రంలో నటించాలి అన్న ఆసక్తి ఉన్నప్పటికీ డేట్స్ కుదరని కారణంగా పృథ్వీరాజ్ ఆ సినిమా చేయలేకపోయారు. అప్పటికే పృథ్వీరాజ్ ఆడు జీవితం ది గోట్‌ లైఫ్‌ మూవీ కోసం కష్టపడుతున్నాడు. ఇదే విషయాన్ని చిరంజీవికి కన్వే చేయగా ఆయన అర్థం చేసుకున్నారట. ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి చిరంజీవి నటించిన లూసిఫర్ మూవీ రీమేక్ గాడ్ ఫాదర్ లో ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం పృథ్వీరాజ్ ను సంప్రదించారు. అయితే అప్పుడు కూడా పృథ్వీరాజ్ ఆడు జీవితం సినిమానే చేస్తుండడం వల్ల గాడ్ ఫాదర్ సినిమాకి సైతం నో చెప్పడం విశేషం.

మెగా స్టార్ రెండు సినిమాల మధ్య నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పటికీ.. పృథ్వీరాజ్ ఇంకా ఆడు జీవితం అనే మూవీ కోసమే తన డేట్లు మొత్తం కేటాయించి ఉండడం గురించి విని చిరంజీవి ఆశ్చర్యపోయారట. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ స్వయంగా తెలియజేశారు.. తను ఆడు జీవితం: ది గోట్‌ లైఫ్‌ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డా అని మధ్యలో వచ్చిన కొన్ని సినిమాలను కూడా రిజెక్ట్ చేసానని ఈ సందర్భంగా తెలియజేశారు.

కాగా ఆడు జీవితం: ది గోట్‌ లైఫ్‌ పృథ్వీరాజ్ కెరియర్ లోనే కష్టమైన మూవీ గా చెప్పవచ్చు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ సుమారు 31 కిలోల బరువు తగ్గి
.. కనిపించడం కోసం ఎన్నో రోజులు ఎంతో కఠినమైన డైట్ ఫాలో అయ్యారు. ఇక ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన తర్వాత విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

సుమారు పదేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం గత ఆరేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. కేరళ నుంచి ఓ దేశానికి పనిచేయడానికి వెళ్లిన యువకుడు.. అక్కడ బానిసగా మారి.. తప్పించుకోవడానికి దారులు వెతుకుతాడు. అలా బయలుదేరిన ఆ వ్యక్తి ఓ ఎడారి దారిలో ఇక ఆ తర్వాత అతడి జీవితంలో చోటు చేసుకున్న మార్పులు తో కథ ముందుకు సాగుతుంది అని టాక్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మూవీ ప్రమోషన్స లో పృథ్వీరాజ్‌ చాలా బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఈనెల 28న పలు భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది. తెలుగులో ఆడు జీవితం అనే టైటిల్ తోటే ఈ మూవీ విడుదలవుతోంది.

Also read: Teaser Dialogues: పవన్‌కు ఎన్నికల సంఘం షాక్‌.. టీజర్‌లో 'గాజు గ్లాస్‌' డైలాగ్స్‌పై ఈసీ స్పందన ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News