Prabhas New Look: రాధేశ్యామ్ నుండి ప్రభాస్ న్యూ లుక్.. లీకైన రాధేశ్యామ్ టీజర్ పిక్స్..??

ప్రభాస్- పూజాహెగ్డే నటిస్తున్న పాన్ ఇండియా సినిమా "రాధేశ్యామ్" సినిమా నుండి ప్రభాస్ కొత్త పోస్టర్ విడులైంది. అంతేకాకుండా, రేపు విడుదల కానున్న సినిమా టీజర్ పిక్స్ ఇవే అంటూ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2021, 12:22 PM IST
  • రాధేశ్యామ్ నుండి విడుదలైన ప్రభాస్ పోస్టర్
  • స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్న ప్రభాస్
  • టీజర్ విడుదలకు సంబందించిన కొన్ని ఫోటోలు లీక్
Prabhas New Look: రాధేశ్యామ్ నుండి ప్రభాస్ న్యూ లుక్.. లీకైన రాధేశ్యామ్ టీజర్ పిక్స్..??

 Prabhs new look released from Radhe Shyam: ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం రాధేశ్యామ్‌ (Radhe Shyam). రాధాకృష్ణ కుమార్‌ (Radha Krishna Kumar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభాస్‌ విక్రమాదిత్యగా (Vikramadithya) కనిపించనున్నారు. ఇక ప్రభాస్‌కు (Prabhas) జోడీగా పూజాహెగ్డే (Pooja Hegde) నటిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్ లు సినీ ప్రేక్షకులను మరియు అభిమానులను చాలా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే!

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా (Pan India Movie) సినిమా రాధేశ్యామ్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్  డే (Prabhas Birthday) సందర్భంగా రాధేశ్యామ్‌ టీజర్‌ (Radhe Shyam Teaser) రిలీజ్‌ డేట్‌ని బుధవారం మూవీ యూనిట్‌ వెల్లడించింది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు మొదలెట్టేసారు. 

Also Read: India Covid Updates: కొత్తగా 15,786 వేలకేసులు.. 231 మరణాలు.. 98.16% రికవరీ రేటు!

అంతేకాకుండా, ప్రభాస్ నటించబోయే సినిమా అప్డేట్స్ కోసం ఇటు టాలీవుడ్ తో పాటు బీ-టౌన్ లో కూడా చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం "రాధేశ్యామ్" సినిమా నుండి విడుదలైన ఒక పిక్ తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో "విక్రమాదిత్యగా" కనిపించబోతున్న ప్రభాస్ లుక్ అదిరిపోయిందని చెప్పాలి. ఈ లుక్ లో ప్రభాస్ స్టైలిష్‌గా కనపడుతున్నాడు. ఆలస్యం దేనికి మీరే ఒక లుక్కేయండి. 

అయితే రేపు రాధేశ్యామ్ సినిమా  టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే సోషల్ మీడియాలో రాధేశ్యామ్  టీజర్ కు సంబంచించిన కొన్ని ఫోటోలు లీక్ (RadheShyam Teaser Leaked Pics) అయినట్టు ప్రచారం జరుగుతుంది. లీకైనవి నిజమో కాదో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిసిందే..

Also Read: PM Modi: ట్విటర్ ప్రొఫైల్ పిక్‌ మార్చిన మోదీ..ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

Trending News