Prabhas meets Allu Arjun:రెబల్ స్టార్ ప్రభాస్ సినీ ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రేటీలకు ఎప్పుడు అండగా నిలుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వ్యక్తిగతంగా వెళ్లి కలిసిన దాఖలాలు చాలా తక్కువ అని చెప్పాలి. కానీ అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్టయి ఈరోజు ఉదయం మధ్యంతర బెయిల్ మీద ఇంటికి వచ్చారో ఇక అప్పటినుంచి సెలబ్రిటీలు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు .
ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా బన్నీ ఇంటికి వచ్చి వారితో మాట్లాడిన ఫోటోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898AD సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలై సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమా తర్వాత మళ్లీ బయటకు కనిపించలేదు ప్రభాస్. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అని తెలియడంతో ఇక ఆయన కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న ప్రభాస్ ఆయనను పరామర్శించి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ప్రభాస్ తో పాటు నాగచైతన్య, దగ్గుబాటి రానా పలువురు సెలబ్రిటీలు అల్లు అర్జున్ కలిశారు. ఇకపోతే నిన్న శుక్రవారం రోజు 12 గంటలకు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ హాస్పిటల్ లో మెడికల్ చెకప్ తర్వాత ఆయనను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
కోర్టులో విచారణ జరిపిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించగా..రంగంలోకి దిగిన అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి గంటసేపు వాదించి క్వాష్ పిటిషన్ పైన మద్యంతర బెయిల్ వచ్చేలా చేశారు. ఇకపోతే నిన్ననే విడుదల కావాల్సి ఉండగా నిన్న రాత్రి మొత్తం చంచల్గూడా జైల్లోనే ఉన్న అల్లు అర్జున్ నేడు ఉదయం బెయిల్ మీద బయటకు వచ్చారు.
ఇక ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ అభిమానులతో ముచ్చటించి, ఆ తర్వాత రెండు సార్లు ప్రెస్ మీట్ తో మాట్లాడారు. ఇక ఇప్పుడు తనను కలవడానికి వస్తున్న సెలబ్రిటీలను స్వాగతం పలుకుతున్నారు.
మోహన్ బాబుకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు, అరెస్టుకు అవకాశం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.