Kalki 2898 AD: నాగ్ అశ్విన్ పర్ఫెక్ట్ ప్లానింగ్.. ఇదెక్కడి స్ట్రాటజీ అంటున్న అభిమానులు

Prabhas Kalki Movie:స్టార్ హీరోల సినిమాలు అంటే ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ప్రభాస్ చిత్రం కల్కి 2898 ఏడి ప్రమోషన్స్ విషయంలో నాగ్ అశ్విన్ స్ట్రాటజీ అందరి మైండ్స్ బ్లాక్ చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2024, 12:17 PM IST
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ పర్ఫెక్ట్ ప్లానింగ్.. ఇదెక్కడి స్ట్రాటజీ అంటున్న అభిమానులు

Kalki Promotions: సలార్ విజయం తరువాత ప్రభాస్ తదుపరి ప్రాజెక్టు గురించి డార్లింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా నెక్స్ట్ ప్రభాస్ నుంచి రాబోయే హై వోల్టేజ్ యాక్షన్ మూవీ కల్కి 2898AD. ఈ మూవీ రావడానికి ఇంకా మూడు నెలల సమయం పడుతుంది. ఒకవేళ మూవీకి సంబంధించిన పనులు ఆలస్యం అయితే కాస్త వాయిదా పడే అవకాశం కూడా ఉంది. మామూలుగా ప్రభాస్ మూవీస్ అంటే విడుదల కి ఒక వారం ,పది రోజుల ముందు హడావిడి ఉంటుంది. అయితే ఈ మూవీ డైరెక్టర్ నాగ అశ్విన్ కల్కి విషయంలో సరికొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు.

ప్రభాస్ సినిమాల పబ్లిసిటీ ఎప్పుడు హడావిడిగా ఉండడంతో ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్ మీద పడుతుంది అని అభిమానులు ఎప్పటినుంచో గోలపెడుతున్నారు. అయితే కల్కి మూవీ కోసం నాగ్ అశ్విన్ చేస్తున్న పబ్లిసిటీ స్టంట్స్ చూస్తుంటే డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. ప్రభాస్ మూవీ ప్రమోషన్స్ రొటీన్ కి భిన్నంగా మొదలుపెట్టి.. ఇప్పటి నుంచే కల్కి మూవీకి హైప్ తీసుకురావడానికి నాగ్ అశ్విన్ ట్రై చేస్తున్నాడు. దీంతో ఇదే కదా కావలసింది అని మురిసిపోతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

కల్కి ప్రమోషన్స్ ను వినూత్నంగా విదేశాల్లో జరిగిన కామిక్ కాన్ ఫెస్టివల్ తో శ్రీకారం చుట్టారు. ఇక ఆ తరువాత హైదరాబాద్ లో రీసెంట్ గా నిర్వహించిన ఫన్ ఎగ్జిబిషన్లో ఈ మూవీకి ఇచ్చిన ఎలివేషన్ వేరే లెవెల్ లో ఉంది. అంతేకాకుండా ఈ మధ్యనే మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ కల్కి ప్రమోషన్స్ లో భాగంగా మూవీ లవర్స్ ను తన వంతు ఎంటర్టైన్ చేశారు. చెన్నై జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిన్న జరిగిన అతని లైవ్ కన్సర్ట్ కు భారీగా సంగీత ప్రియులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సంతోష్.. కల్కి మూవీకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లోని చిన్ని పార్టీ లైవ్ లో వాయించి అందరిని ఎక్సయిట్ అయ్యేలా చేశాడు. సినిమా మ్యూజిక్ లోని చిన్న భాగమే ఇంత బాగుంది అంటే ఇంకా ఈ  మూవీలో  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ షాక్ అయ్యారు.

కాగా మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిన్న బిట్టు బయట పెట్టడం అనేది వైజయంతి మూవీస్ అఫీషియల్ గా ఇచ్చిన పర్మిషన్ తోటే జరిగింది. ఈ చిన్ని కాన్సెప్ట్ తో మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇలా ఓ ప్లానింగ్ ..ఓ పద్ధతి ..ఫాలో అవుతూ నాగ్ అశ్విన్ కల్కి మూవీ ప్రమోషన్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇదంతా చూసి ప్రభాస్ అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు.

కాగా ఈ చిత్రం మే 9న రిలీజ్ అయ్యే విధంగా మేకర్స్ అన్ని సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్‌ క్రికెటర్‌

Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News