/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

Salaar Remunerations: గత కొద్దిరోజులుగా టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ చిత్రం ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడంతో ప్రభాస్ ఎంతగానో ఎదురు చూసిన బ్లాక్ బస్టర్ వచ్చేసింది అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించి చాలా విషయాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అందులో ఒకటి మూవీ కోసం ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అన్న విషయం. మరి హీరో దగ్గర నుంచి విలన్ వరకు ఈ సినిమాలో చేసినందుకు ఒక్కొక్కడు ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారు చూద్దాం పదండి..

ప్రభాస్:

సలార్ అంటే ప్రభాస్.. ప్రభాస్ అంటే సలార్.. అనే విధంగా ఈ సినిమాలో యాక్ట్ చేశారు ప్రభాస్. కాగా ఈ మూవీ కోసం ప్రభాస్ అక్షరాల 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు అని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇక మూవీ లాభాలలో కూడా 10% వరకు వాటా హీరో ఖాతా కి వెళ్తుందట. ఈ మూవీ మొత్తం బడ్జెట్ 400 కోట్లు అని అంచనా.

ప్రశాంత్ నీల్:

తెర ముందు ప్రభాస్ సినిమాని నడిపిస్తే తెర వెనుక చిత్రాన్ని నడిపించిన వ్యక్తి ప్రశాంత్ నీల్. డైరెక్టర్ గా ఇతను 50 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

పృథ్వీరాజ్ సుకుమారన్:

ప్రభాస్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో.. మూవీలో వరదరాజు మన్నారు పాత్రను పోషించిన పృథ్విరాజ్ సుకుమార్ ఈ చిత్రం కోసం నాలుగు కోట్ల రూపాయలు అందుకున్నారు.

శృతి హాసన్:

ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ 8 కోట్ల రూపాయలు పొందినట్లు తెలుస్తోంది.

జగపతి బాబు:

సలార్ మూవీలో మరొక ముఖ్యమైన పాత్ర రాజ్ మన్నారు.. ఈ పాత్రలో నటించిన జగపతిబాబు.. ఈ చిత్రానికి గాను రెమ్యూనరేషన్ కింద నాలుగు కోట్ల రూపాయలు అందుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ ఎక్కడో ఎవరికీ తెలియని ఒక  ఖాన్సా నగరం.. దాని వారసత్వం చుట్టూ జరిగే పాలిటిక్స్.. పవర్ సాధించడం కోసం ఎత్తులు పై ఎత్తులు.. వీటన్నిటి మధ్య తన ఫ్రెండ్ కోసం ఒంటరిగా నిలబడే యోధుడు. కథ రొటీన్ గానే అనిపించిన.. ఈ సినిమాని ప్రశాంత్ నీల్ తీర్చిదిద్దిన తీరు మాత్రం అద్భుతంగా ఉంది అని అభినందిస్తున్నారు ఈ సినిమా చూసిన ప్రేక్షకులు.
యాక్షన్ సన్నివేశాలతో.. అద్భుతమైన టేకింగ్ తో ముందుకు సాగే ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ భారీ యాక్షన్ మూవీ మొదటి రోజే ఇండియా వైడ్ 95 కోట్ల వరకు నికర వసూలు రాబట్టింది అని అంచనా.  ఇక పోను పోను ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ

Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Section: 
English Title: 
Prabhas and Prashanth Neel To Shruti Haasan here is how much Salaar actors charged for their roles
News Source: 
Home Title: 

బాక్సాఫీస్ రికార్డులు బద్దలు..సలార్ స్టార్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Salaar Cast Remuneration: బాక్సాఫీస్ రికార్డులు బద్దలు..సలార్ స్టార్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Caption: 
Salaar Remunerations(source:X)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
బాక్సాఫీస్ రికార్డులు బద్దలు..సలార్ స్టార్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ZH Telugu Desk
Publish Later: 
Yes
Publish At: 
Friday, December 22, 2023 - 19:30
Created By: 
Vishnupriya Chowdhary
Updated By: 
Vishnupriya Chowdhary
Request Count: 
32
Is Breaking News: 
No
Word Count: 
331