మళ్లీ వార్తల్లోకెక్కిన ప్రభాస్-అనుష్క పెళ్లి మేటర్

బాలీవుడ్ మీడియాలో ప్రనుష్క పెళ్లిపై కథనాలు 

Last Updated : May 20, 2018, 03:58 PM IST
మళ్లీ వార్తల్లోకెక్కిన ప్రభాస్-అనుష్క పెళ్లి మేటర్

ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త ఇవాళ కొత్తది కాదు. బాహుబలి సినిమా కన్నా ముందే మిర్చి సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఆడియెన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన బాహుబలి సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీకి ఇక అడ్డూఅదుపు లేదు. దీంతో ఈ ఇద్దరి జోడీ రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ ఒక్కటైతే బాగుంటుందని అటు ప్రభాస్ ఫ్యాన్స్, ఇటు అనుష్క ఫ్యాన్స్ ఆశించారు. హైటు, వెయిట్, పర్సనాలిటీకి తగిన జోడీ అంటూ అప్పుడే కితాబిచ్చారు. ప్రభాస్-అనుష్క ప్రేమలో మునిగితేలుతున్నారు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని వస్తోన్న వార్తల్ని ఆ ఇద్దరు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఆ ఇద్దరి పెళ్లిపై రూమర్స్‌‌కి మాత్రం ఫుల్‌స్టాప్ పడటం లేదు. 

ఇదిలావుంటే, తాజాగా ఈ ఇద్దరి లవ్ స్టోరీ, వెడ్డింగ్ మ్యాటర్ మరోసారి వార్తల్లోకెక్కింది. ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్‌తో అబుధాబిలో బిజీగా వున్న ప్రభాస్ ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా అనుష్కతో టచ్‌లో వున్నాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ప్రనుష్క జంట త్వరలోనే ఒక్కటి కాబోతోందనేది ఆ వార్తల సారాంశం. తాజాగా గుప్పుమంటున్న ఈ వార్తలపై ఈ జంట మళ్లీ ఎప్పుడు స్పందిస్తుందో మరి!

Trending News