Pooja Hegde Dating: సల్మాన్ తో పూజా డేటింగ్.. అందుకే ఏమీ మాట్లాడడం లేదట!

Pooja Hegde Dating With Salman Khan: బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్న పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా ప్రమోషన్స్ లో సల్మాన్ తో డేటింగ్ గురించి పూజా హెగ్డే స్పందించింది.   

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 14, 2023, 05:11 PM IST
Pooja Hegde Dating: సల్మాన్ తో పూజా డేటింగ్.. అందుకే ఏమీ మాట్లాడడం లేదట!

Pooja Hegde Opens upon Dating With Salman Khan: తెలుగులో ఇప్పటికే స్టార్ హీరోయింగా అనేక సినిమాల్లో అనేకమంది స్టార్ హీరోలతో నటించిన పూజా హెగ్డే బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె పలు ప్రాజెక్టులు చేసినా బాలీవుడ్ లో పెద్దగా ఆమెకు కలిసి రాలేదు. మరో వారం రోజుల్లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా విడుదల కాబోతోంది. ఏప్రిల్ 21 రంజాన్ సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వీరం సినిమాకి ఈ సినిమా హిందీ రీమేక్ కాగా తెలుగు హీరోయిన్ పూజా హెగ్డే, విక్టరీ వెంకటేష్, జగపతి బాబు ప్రధాన పాత్రలలో నటించడమే కాదు రామ్ చరణ్ కూడా ఒక పాటలో భాగమవడంతో ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ లుక్స్ మీద ట్రోలింగ్ జరుగుతున్నా బాలీవుడ్ అంతా ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయం మీద ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇక ఈ సినిమాలో నటిస్తున్న జంటల గురించి అనేక రూమర్లు తెరమీదకు రాగా సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే రిలేషన్ లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎంటర్టైన్మెంట్ టైంకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చేసింది.

ఇదీ చదవండి: Child Artist Neha Thota: 'విక్రమార్కుడు'లో రవితేజ కూతురిగా నటించిన పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

తాను ఎవరితోనో డేటింగ్ లో లేనని ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో అయితే రిలేషన్ షిప్ లో లేనని ఆమె క్లారిటీ ఇచ్చేసింది. తాను ప్రస్తుతానికి సింగిల్ గా ఉన్నానని ఎవరితో డేటింగ్ లో లేననే విషయాన్ని మరోసారి కుండ బద్దలు కొట్టినట్లు వెల్లడించింది. ప్రస్తుతానికి తాను పూర్తిగా తన కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నానని తనకు సినిమాలకు డేట్లు కేటాయించేందుకే సమయం సరిపోవడం లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ ఖాన్ తో డేటింగ్ లో ఉన్నారట కదా నిజమేనా అని ప్రశ్నిస్తే దానికి నేనేం చెప్పాలి, నా గురించి వస్తున్న వార్తలు నేను చదువుతూనే ఉంటాను.

కానీ నేను సింగిల్ గా ఉండటానికి ఇష్టపడతా ప్రస్తుతానికి నేను పూర్తిస్థాయిలో నా కెరియర్ మీద దృష్టి పెడుతున్నాను, అక్కడ ఇక్కడా అని కాదు అన్ని చోట్ల సినిమా అవకాశాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాను, నాకు ఇలాంటి రూమర్స్ చదివి కూడా వాటిని ఖండించేందుకు సమయం ఉండడం లేదు అంటూ తన బిజీ షెడ్యూల్ గురించి చెప్పుకొచ్చింది.

ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడే వీరిద్దరి మధ్య ఏదో మొదలైంది అనే ప్రచారం జరగగా ఫిబ్రవరిలో జరిగిన పూజా హెగ్డే సోదరుడు రిషబ్ హెగ్డే పెళ్లికి సల్మాన్ ఖాన్ హాజరవడంతో దాదాపు వీరి మధ్య డేటింగ్ ఖరారు అని అందరూ భావించారు. అయితే తనతో పాటు హీరోయిన్గా నటిస్తున్న పూజా సోదరుడు వివాహం అయితే తాను ఎందుకు హాజరు కాకుండా ఉంటానని సల్మాన్ అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. అయినా ఈ ప్రచారం మాత్రం ఆగలేదు. 

ఇదీ చదవండి: SS Rajamouli Love Story: రమతో రాజమౌళి ప్రేమ..రెండో పెళ్లి.. అందుకే పిల్లలు కూడా వద్దనుకున్నారట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News