PS-1 Day 2 Collections: రూ.150 కోట్ల క్లబ్‌లో పొన్నియన్‌ సెల్వన్‌.. తమిళనాడులో రికార్డు కలెక్షన్స్‌!

Mani Ratnam's Ponniyin Selvan movie Day 2 collections. డైరెక్టర్‌ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'పొన్నియన్‌ సెల్వన్‌-1 సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 2, 2022, 03:05 PM IST
  • ప్రేక్షకుల ముందుకు పొన్నియన్‌ సెల్వన్‌-1
  • బాక్సాఫీస్ వద్ద 'పొన్నియన్ సెల్వన్' ప్రభంజనం
  • తమిళనాడులో రికార్డు కలెక్షన్స్‌
PS-1 Day 2 Collections: రూ.150 కోట్ల క్లబ్‌లో పొన్నియన్‌ సెల్వన్‌.. తమిళనాడులో రికార్డు కలెక్షన్స్‌!

Ponniyin Selvan 1 Day 2 Collections: లెజండరీ డైరెక్టర్‌ 'మణిరత్నం' ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్‌ చిత్రం 'పొన్నియన్‌ సెల్వన్‌-1'. ప్రముఖ తమిళ రచయిత క‌ల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్‌ న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తమిళ స్టార్ హీరోలు చియాన్ విక్రమ్‌, జయం రవి, కార్తీ.. అందాల తారలు ఐశ్వర్యా రాయ్‌, త్రిషలు పీఎస్‌-1లో ప్రధాన పాత్రలు పోషించారు. పొన్నియన్‌ సెల్వన్‌ రెండు భాగాలుగా వస్తుండగా..  మొదటి భాగం శుక్రవారం (సెప్టెంబర్‌ 30న) ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పర్వాలేదనిపించింది. తమిళనాడులో మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. 

పొన్నియన్ సెల్వన్ 1 సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ రాబట్టింది. మొదటి రోజు మంచి కలెక్షన్స్‌ రాబట్టిన పీఎస్‌-1.. రెండోరోజు కూడా సత్తాచాటింది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల తన ట్వీట్ ద్వారా తెలిపారు. 'పొన్నియన్‌ సెల్వన్‌-1 సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది' అని పేర్కొన్నారు. ఈ సినిమా దాదాపు రూ.150 కోట్ల గ్రాస్‌, రూ.75 కోట్ల షేర్‌ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

పొన్నియన్ సెల్వన్ 1 చిత్రంకు తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన లభించగా.. తమిళనాట మాత్రం హిట్‌ టాక్‌ వచ్చింది. దాంతో అక్కడ రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబడుతోంది. తమిళనాడులో రెండు రోజుల్లో రూ.50 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టిందట. తెలుగు రాష్ట్రాలలో రూ.9 కోట్లట్లు, కేరళలో రూ.6 కోట్లు, ఓవర్సీస్‌లో దాదాపుగా 65 కోట్లకు పైగా వసూల్ చేసింది. పీఎస్‌-1 ఈజీగా బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Also Read: IND vs SA 2nd T20I: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రెండో టీ20 మ్యాచ్‌ కష్టమే!

Also Read: ఆయన నేను ఎందుకూ పనికిరాననుకున్నారు.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా: అల్లు అర్జున్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News