Maharaj Movie: అమీర్‌ఖాన్‌ తనయుడి 'మహారాజ్' సినిమాపై తీవ్ర దుమారం.. శాశ్వతంగా బ్యాన్..?

Maharaj Movie Controversy: బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ అరంగేట్ర చిత్రం 'మహారాజ్'. ఈ సినిమా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌ కాగా.. హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ చిత్రంపై గుజరాత్ హైకోర్టు స్టే విధించింది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 17, 2024, 04:59 PM IST
Maharaj Movie: అమీర్‌ఖాన్‌ తనయుడి 'మహారాజ్' సినిమాపై తీవ్ర దుమారం.. శాశ్వతంగా బ్యాన్..?

Maharaj Movie Controversy:మహారాజ్’ అనే చిత్రంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. సనాతన హిందూ సమాజాన్ని అవమానించేలా ఉన్న ఈ సినిమాను బహిష్కరించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సినిమా విడుదలపై గుజరాత్ హైకోర్టు స్టే ఇవ్వగా.. ఈ నెల 18న తీర్పు వెల్లడించనుంది. ఈ పిటిషన్‌ దాఖలు చేసిన ఒక్క రోజులోనే 25 వేల మంది సినిమాను బహిష్కరించాలని సంతకాలు చేశారు. కోర్టు నిర్ణయం కంటే ముందు సనాతని హిందువులందరూ ఏకమై ఈ సినిమా విడుదలను వ్యతిరేకించి మన సత్తా చాటాలని హిందూ సంఘాలు పిలుపునిస్తున్నాయి. భారతదేశంలో బ్రిటిష్ పాలనలో 1862 నాటి పరువునష్టం కేసు ఆధారంగా ఈ చిత్రం రూపొందించినట్లు సినిమా మేకర్స్ తరుఫున న్యాయవాదులు వాదిస్తున్నారు.

Also Read: Dj Siddharth: హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ గబ్బు... ఫెమస్ డీజేతో పాటు మరోకరికి పాజిటివ్..

ఆ సమయంలో బ్రిటీష్ న్యాయవ్యవస్థ, భారతీయ సనాతన ధర్మం, హిందూ పవిత్ర గ్రంథాలు, మంత్రాలను పక్షపాతంతో తప్పుగా అన్వయించినట్లు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. 200 ఏళ్ల నాటి ఈ కుట్ర కేసును మళ్లీ తెరపైకి తీసుకువరావడం వెనుక ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా సనాతన ధర్మాన్ని కించపరిచే ప్రయత్నమని హిందూ సంఘాల తరుఫున పిటిషనర్లు వాదించారు. ఇలాంటి తప్పుదారి పట్టించే కంటెంట్‌ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. ఇది గుజరాత్‌ సహా భారతదేశం, సనాతన ధర్మం భవిష్యత్‌ను ప్రభావితం చేస్తుందన్నారు. మీడియాలోని తప్పుడు వర్ణనలు ప్రజలు సాంస్కృతిక, మతపరమైన ఆచారాలు అపోహలు, పక్షపాతాలకు దారి తీస్తుందని చెప్పారు. అందుకే సినిమాలు, 

ఇతర మాధ్యమాల్లోని అన్ని కచ్చితమైనవి, గౌరవప్రదంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమని కోర్టుకు నివేదించారు. సనాతన హిందువులందరూ ఏకమై ఈ సినిమా రిలీజ్‌కు తీవ్రంగా వ్యతిరేకించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న కోర్టు.. జూన్ 18వ తేదీ వరకు స్టే విధించింది. సనాతన ధర్మానికి ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు సినిమా విడుదలను శాశ్వతంగా రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. సనాతన హిందూ సమాజం మొత్తం 'మహారాజ్' సినిమా విడుదలను తీవ్రంగా వ్యతిరేకించాలని హిందూ సంఘాలు పిలుపునిస్తున్నాయి. అనైతిక చిత్రణగా భావించే దానికి వ్యతిరేకంగా నిలబడాలని కోరుతున్నాయి. ఈ చిత్రాన్ని నిలిపివేయాలని 24 గంటల్లో 25 వేల మంది హిందువులు పిటిషన్‌పై సంతకం చేశారు.  

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ 'మహారాజ్'తో తొలిసారి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. జూన్ 14ను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వగా.. వెంటనే తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. గతంలో ట్విట్టర్‌లో 'బాయికాట్ నెట్‌ఫ్లిక్స్', 'బ్యాన్ మహారాజ్' వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి.

Also Read: Nayanthara: ఆటో డ్రైవర్, డెలివరీ అబ్బాయితో గొడవపడి.. ఇల్లు ఖాళీ చేసిన నయనతార..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News