Pawan Kalyan fans slams Dil Raju: దిల్ రాజుపై పవన్ కల్యాన్ ఫ్యాన్స్ ఫైర్

Pawan Kalyan fans, Dil Raju, Vijay Deverakonda: ఇటీవల ఆశిశ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన రౌడీ బాయ్స్ సినిమా సాంగ్ లాంచింగ్ ఈవెంట్‌కి (Rowdy Boys Movie Song Launch Event) హాజరైన విజయ్ దేవరకొండను ఉద్దేశించి దిల్ రాజు మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2021, 05:49 PM IST
Pawan Kalyan fans slams Dil Raju: దిల్ రాజుపై పవన్ కల్యాన్ ఫ్యాన్స్ ఫైర్

Pawan Kalyan fans, Dil Raju, Vijay Deverakonda: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దిల్ రాజుపై ఫైర్ అవుతున్నారు. అందుకు కారణం విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ను పవన్ కల్యాణ్‌కి ఉన్న క్రేజ్‌తో పోల్చుతూ పలు వ్యాఖ్యలు చేయడమేనట. అవును, ఇటీవల ఆశిశ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన రౌడీ బాయ్స్ సినిమా సాంగ్ లాంచింగ్ ఈవెంట్‌కి (Rowdy Boys Movie Song Launch Event) హాజరైన విజయ్ దేవరకొండను ఉద్దేశించి దిల్ రాజు మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తేశాడు. 

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకు భారీ క్రేజ్ ఏర్పడిందని, గీత గోవిందం సక్సెస్ అవడంతో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడని విజయ్ దేవరకొండను ప్రశంసల్లో ముంచెత్తాడు. అంతటితో సరిపెట్టుకోని దిల్ రాజు.. అతి కొద్ది కాలంలోనే భారీ క్రేజ్, స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడంటూ విజయ్ దేవరకొండ క్రేజును (Vijay Deverakonda) పవన్ కల్యాణ్ క్రేజ్‌తో పోల్చడం చూసి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది లైట్ తీసుకున్నా.. ఇంకొంత మంది మాత్రం దిల్ రాజుపై తమ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. 

ఎంతో కఠోర శ్రమతో, పలు సిద్ధాంతాలతో ముందుకు వెళ్తున్న పవన్ కల్యాణ్‌తో విజయ్ దేవరకొండను పోల్చడం ఏంటంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ (Pawan Kalyan fans) ఫీలవుతున్నారు. ఇదే విషయమై సోషల్ మీడియా వేదికగా కొంత మంది తమ అభిప్రాయాలను పంచుకుంటుంటే.. ఇంకొంత మంది దిల్ రాజుపై (Dil Raju) తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

Also read : Deepika Ranveer to Bid IPL Team: ఐపీఎల్ ప్రాంచైజీ రేసులో బాలీవుడ్ స్టార్ కపుల్..?? ఎంత వరకు నిజం?

ఇదంతా ఇలా ఉంటే.. విజయ్ దేవరకొండ గురించి గొప్పగా చెప్పుకొచ్చిన దిల్ రాజు (Dil Raju praises Vijay Devarakonda).. తన ప్రసంగం చివర్లో మరో మాట కూడా చెప్పుకొచ్చాడు. త్వరలోనే విజయ్ దేవరకొండతో తాను ఓ సినిమా చేయాలని భావిస్తున్నట్టు చెప్పాడు. 

విజయ్ దేవరకొండ చిత్రాల విషయానికొస్తే.. ప్రస్తుతం విజయ్ లైగర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న లైగర్ మూవీలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే జంటగా నటిస్తోంది. ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్‌తో అంతకు ముందు జరిపిన చాటింగ్ ఆధారంగా అనన్యా పాండేకు (NCB grills Ananya Panday) సైతం డ్రగ్స్ కేసులో సంబంధం ఉందంటూ మహారాష్ట్ర నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విభాగం ఆమెను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.

Also read : Prabhas New Look from Radhe shyam movie : రాధేశ్యామ్ నుండి ప్రభాస్ న్యూ లుక్.. లీకైన రాధేశ్యామ్ టీజర్ పిక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News