Pallavi Prasanth Case: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో మరో 16 మంది అరెస్ట్

Pallavi Prasanth Case Update: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో మరో 16 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో 12 మంది మేజర్లుకాగా.. నలుగురు మైనర్లు ఉన్నారు. వీరిని కోర్టులో హాజరుపరచి రిమాండ్ కు తరలించున్నారు పోలీసులు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2023, 06:00 PM IST
Pallavi Prasanth Case: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో మరో 16 మంది అరెస్ట్

Bigg Boss case Update: బుల్లితెర పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ షో కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత జరిగిన దాడి ఘటనలో సీజన్ 07 విజేత పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా మరో 16 మందిని అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. కాసేపట్లో వీరిని కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. ఆర్టీసి బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడిన 16 మందిలో 12 మేజర్లు కాగా.. నలుగురు మైనర్లు ఉండటం విశేషం. 

డిసెంబరు 17, ఆదివారం నాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఈ సీజన్ విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఈ క్రమంలో షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రోఫీ గెలిచిన ప్రశాంత్‌ స్టూడియోస్‌ నుంచి బయటికి రాగా అభిమానులు ఘనస్వాగతం పలికారు. రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ కు కూడా ఫ్యాన్స్ అదే రేంజ్ లో స్వాగతం ఇచ్చారు. ఈ క్రమంలో ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు అమర్ కారుపై రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని కారు అద్దాలను పగులగొట్టారు. రోడ్డుపై వెళ్తున్న 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు,  పంజాగుట్ట ఏసీపీ కారు అద్దాలను ధ్వంసం చేశారు. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఇందులో ఏ1గా ప్రశాంత్‌, ఏ2గా మనోహర్‌, ఏ3గా అతడి స్నేహిడుతు వినయ్‌ను చేర్చారు. వీరిని వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం ప్రశాంత్, అతడి సోదరుడు మనోహర్ కు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఇద్దరినీ జూబ్లీహిల్స్‌ పోలీసులు చంచల్‌గూడ జైలుకు (Chanchalguda Jail) తరలించారు.

Also Read: RGV Movie: ఆర్జీవీ చెప్పినట్టే హీరోయిన్ ను చేసేసి.. 'శారీ'తో షాకిచ్చాడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News