Chiranjeevi: చిరంజీవికి పద్మవిభూషణ్..? సోనూసూద్‌కు ఎందుకు ఇవ్వరని నెటిజన్లు ఫైర్

Padma Vibhushan for Chiranjeevi: రిపబ్లిక్ డే సందర్భంగా చిరంజీవికి పద్మభూషణ్ ఇవ్వబోతున్నారు అనే వార్త గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది మాత్రం చిరంజీవికి పద్మభూషణ్ ఇవ్వడంపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2024, 05:20 PM IST
Chiranjeevi: చిరంజీవికి పద్మవిభూషణ్..? సోనూసూద్‌కు ఎందుకు ఇవ్వరని నెటిజన్లు ఫైర్

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారు తెలుగు రాష్ట్రాలలోనే.. కాదు దేశవ్యాప్తంగా ఎవరూ ఉండరు. స్వయంకృషితో హీరోగా ఎదిగి.. మెగాస్టార్ రేంజ్ కి చేరుకున్నారు చిరు. ఆయన ప్రయాణంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు‌. ఈ నేపథ్యంలో చిరంజీవికి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించనున్నట్లు సోషల్ మీడియాలో గత కొద్దిరోజులగా ప్రచారం జరుగుతోంది. ఈ సంవత్సరం పద్మ అవార్డ్స్ లిస్ట్‌లో చిరంజీవి పేరు ప్రముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ కు పద్మవిభూషణ్ అవార్డు రావడం గురించి రిపబ్లిక్ డే రోజు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. రిపబ్లిక్ డే రోజున మోదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. 

2019, 2020లో కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినీ కార్మికులకు కూడా ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఇక అప్పుడు సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి మోదీ ప్రభుత్వం మెగాస్టార్‌ను పద్మవిభూషణ్‌తో సత్కరించనున్నట్లు సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా గట్టిగా ప్రచారం జరుగుతోంది. లాక్‌డౌన్ టైమ్‌లో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు చిరంజీవి నిత్యావసరాలు అందజేయతమే కాకుండా.. కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన సామన్య ప్రజలను సైతం ఆయన ఆక్సిజన్ సదుపాయాలను ఉచితంగా కల్పించారు. ఆ సేవలు గుర్తిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కానీ ఈ వార్త బయటకు వచ్చిన దగ్గరనుంచి కొంతమంది మాత్రం ఈ విషయంపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి చిరంజీవి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు.. ఆ టైంలో సేవలు చేసిన ఎంతోమంది హీరోలు ఎందుకు కనిపించడం లేదు అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కరోనా టైం లో సోనూసూద్‌ చేసినన్ని సేవలు..సహాయాలు..ఎవ్వరూ చేయలేదని చెప్పాలి. ట్విట్టర్ లో ఎవరికీ కష్టం ఉందని పోస్ట్ కనిపించిన వారి దగ్గరికి వెళ్లి మరి ఆదుకున్నారు. మరి అలాంటి ఆయన్ని ఎందుకు ప్రభుత్వం గుర్తించలేదని.. మిగతా హీరోలాగే సాధారణ సహాయాలు చేసిన చిరంజీవికే ఎందుకు పద్మవిభూషణ్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. మెగా అభిమానులు తప్ప సాధారణ ప్రేక్షకులు కూడా ఇందుకు మద్దతు పలకడం విశేషం. ప్రభుత్వానికి సోనూసూద్ ఎందుకు కనిపించడం లేదు.. వివక్ష లేకుండా ఉంటే.. ముందుగా ఆయనకే ఈ అవార్డు రావాలి అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు

Also Read: Rat found in Online Food: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. చచ్చిన ఎలుకను తిన్న యువకుడు 

Also Read: Upcoming Best OLED TVs 2024: Samsung, LGకి షాక్‌..డెడ్‌ చీప్‌ ధరకే AI ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి Panasonic OLED టీవీలు..

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News