Oka Chinna Family Story Trailer: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్... చెప్పడం కాదు.. చూసి తీరాల్సిందే

Oka Chinna Family Story Trailer: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా నాగార్జున అక్కినేని (Nagarjuna Akkineni) మాట్లాడుతూ.. '' ట్రైలర్ చూశాకా వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడూ చూడాలా అనిపించింది. తన చిన్న మిడిల్ క్లాస్ కష్టాలను మహేష్ ఎలా అధిగమించాడా అనేదే ఆసక్తికరంగా అనిపిస్తోంది'' అని అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2021, 04:53 AM IST
Oka Chinna Family Story Trailer: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్... చెప్పడం కాదు.. చూసి తీరాల్సిందే

Oka Chinna Family Story Trailer: ZEE5లో ప్రసారం కానున్న ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్‌ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుదలైంది. నిహారిక కొనిదెల నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ని మహేష్ ఉప్పాల డైరెక్ట్ చేస్తున్నాడు. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో సీనియర్ హీరో నరేష్, సీనియర్ నటి తులసి, గెటప్ శ్రీను (Getup Srinu) తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 

ఒక గమ్యం, లక్ష్యం లేకుండా లేజీగా బతికేస్తున్న ఓ యువకుడిపై అనుకోకుండా మొత్తం కుటుంబభారంతో పాటు తండ్రి చేసిన అప్పు వల్ల వచ్చిన ఆర్థిక భారం కూడా పడితే ఎలా ఉంటుంది ? ఆ ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు అసరమైన ఈజీ మనీ (Easy money) కోసం ఆ యువకుడు ఎలాంటి మార్గం ఎంచుకున్నాడు ? ఏం చేశాడనేదే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ కథనం.

 

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా నాగార్జున అక్కినేని (Nagarjuna Akkineni) మాట్లాడుతూ.. '' ట్రైలర్ చూశాకా వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడూ చూడాలా అనిపించింది. తన చిన్న మిడిల్ క్లాస్ కష్టాలను మహేష్ ఎలా అధిగమించాడా అనేదే ఆసక్తికరంగా అనిపిస్తోంది. అదేంటో తెలియాలంటే నవంబర్ 19న ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ ప్రీమియర్ (Oka Chinna Family Story Trailer) అయ్యే వరకు వేచిచూడాల్సిందే'' అని అన్నారు.

Trending News