NTR30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్‌ప్రైజ్... నెక్ట్స్ మూవీ మోషన్ పోస్టర్ అదుర్స్...

NTR30 Latest Updates:  జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ కాసేపటి క్రితమే సోషల్ మీడియాలో విడుదలైంది. మోషన్ పోస్టర్‌తోనే ఈ సినిమాపై అంచనాలను పెంచేశాడు దర్శకుడు కొరటాల శివ.

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2022, 07:58 PM IST
  • ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా అప్‌డేట్ వచ్చేసింది
  • మోషన్ పోస్టర్ విడుదల చేసిన తారక్
  • కొరటాల శివతో మాస్ ఎంటర్టైనర్
NTR30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్‌ప్రైజ్... నెక్ట్స్ మూవీ మోషన్ పోస్టర్ అదుర్స్...

NTR30 Latest Updates: తన పుట్టినరోజుకు ఒకరోజు ముందు ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు తారక్. కొరటాలతో తన తదుపరి సినిమాకు సంబంధించి 
ఓ ఖతర్నాక్ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ రౌద్రంగా పలికిన డైలాగ్... చేతుల్లో కత్తులతో సముద్రం మధ్యలో నిలుచున్న తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది పక్కా మెంటల్ మాస్ అని సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మోషన్ పోస్టర్‌లో 'అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి. తను రావాల్సిన సమయం వచ్చిందని... వస్తున్నా...' అంటూ ఎన్టీఆర్ పలికిన డైలాగ్ ఓ రేంజ్‌లో ఉందనే చెప్పాలి. పోస్టర్‌లో ఎన్టీఆర్‌ను చూపించిన తీరు... ఆయన పలికిన డైలాగ్ చూస్తుంటే ఇది పక్కా ఔట్ అండ్ ఔట్ మాస్ సినిమా అని అర్థమవుతోంది.

నిజానికి కొరటాల శివ 'ఆచార్య' సినిమా చూశాక తారక్ ఫ్యాన్స్ భయపడిపోయారు. చిరంజీవికి పెద్ద డిజాస్టర్ ఇచ్చిన శివ... నెక్స్ట్ తమ హీరోతో ఎలాంటి సినిమా చేస్తాడో ఏమో అనే టెన్షన్  తారక్ ఫ్యాన్స్‌లో ఉంది. అయితే తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ వారి అనుమానాలు, భయాలను పటాపంచలు చేసేలా ఉంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణలు నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేలు, ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్ వ్యవహరించనున్నారు.

 

Also Read: Shani Jayanti 2022: శని జయంతి ఎప్పుడు.. శని పూజ ఎలా చేయాలి.. ఏలినాటి శని నుంచి ఎలా విముక్తి పొందాలి..  

Also Read: Nallala Odelu Joins Congress: కాంగ్రెస్‌ గూటికి నల్లాల ఓదెలు.. ప్రియాంక గాంధీ సమక్షంలో చేరిక.. ఇక బాల్క సుమన్‌తో 'ఢీ'..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News