Nikhil Siddhartha Clarity on His Divorce Rumors: కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోలలో యంగ్ హీరో నిఖిల్ కూడా ఒకరు. ఆయన డాక్టర్ పల్లవి వర్మ అనే యువతిని ప్రేమించి కరోనా సమయంలో తమ పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు.
అయితే కొన్నాళ్ల క్రితం నుంచి నిఖిల్ తన భార్యతో సరిగ్గా ఉండడం లేదని ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో త్వరలోనే విడిపోయే అవకాశం ఉందని రకరకాల ప్రచారాలు తెరమీదకు వస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో నిఖిల్ తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడం కూడా ఈ ప్రచారానికి ఊతం ఇచ్చినట్లయింది. అయితే ఈ విషయం నిఖిల్ దృష్టికి వెళ్లిందో లేఖ యాదృచ్ఛికంగా షేర్ చేశాడో తెలియదు.
కానీ తాను తన భార్యతో గోవాలో ఉన్నట్లుగా ఒక ఫోటో షేర్ చేసి మీ ఇద్దరం కలిసి ఉన్నప్పుడు చాలా బెటర్ గా ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాక తన భార్యతో తాను గోవాలో ఉన్నట్లు కూడా హింట్ ఇచ్చాడు నిఖిల్. 2020 కరోనా సమయంలో భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాల వారు ఇద్దరి వివాహాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైదరాబాదులో అదీ తక్కువమంది కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరిగింది.
ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హీరోగా మంచి పేరు సంపాదించుకున్న నిఖిల్ ప్రస్తుతానికి 18 పేజెస్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమా షూటింగ్ పూర్తవుగా విడుదల అయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది మరోపక్క స్పై అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కూడా నిఖిల్ సిద్ధార్థ భాగమయ్యారు. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.
Also Read: Samanthas Myositis: సమంత జబ్బుతో నేనూ బాధ పడుతున్నా.. ఆమెకు థర్డ్ స్టేజ్.. కల్పిక సంచలనం!
Also Read: Balakrishna Fans: బాలకృష్ణ ఫాన్స్ రచ్చ.. మహేష్ బాబు థియేటర్ ధ్వంసం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook