ఎన్టీఆర్ పాత్రలో కొత్త నటుడు : వర్మ

Last Updated : Oct 16, 2017, 08:04 PM IST
ఎన్టీఆర్ పాత్రలో కొత్త నటుడు : వర్మ

సంచలన దర్శకుడు వర్మ ..మరో సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ఎన్టీఆర్ లాంటి మహానటుడు గురించి తీస్తున్న సినిమాకు ఎంతటి ఘనమైన నటుడ్ని మాత్రమే తీసుకుంటారని అందరూ భావించారు. అయితే దీనికి భిన్నంగా ఆయన పాత్రలో నటించేందుకు కొత్త నటుడిని ఎంపిక చేసినట్లు   లక్ష్మీస్ ఎన్టీఆర్  డైరెక్టర్ వర్మ సంచల ప్రకటించారు. ఓ ఇంటర్క్వూ లో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ పాత్రాలో న‌టించే న‌టుడిని తాను ఇప్పటికే ఎంపిక చేశానని చెప్పారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో ఓ కొత్త న‌టుడిని ఎన్టీఆర్ గా చూస్తారని పేర్కొన్నారు. ఈ సినిమాలోని ఎవరు ఏ పాత్రలో నటిస్తారో ఇప్పుడే చెప్పబోమన్నారు. ఈ సినిమాను కొందరు గుడ్ .. కొందరు బ్యాడ్ అంటున్నారు. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా.. వాస్తవానికి అద్దంపట్టేలా ఈ సినిమా తీస్తానని  దర్శకుడు వర్మ తెలిపారు.

సాదాసీదా హీరోయిన్...

లక్ష్మీ పార్వతి గ్రామరస్‌గా ఉండబోదని వర్మ మరో విషయాన్న వెల్లడించారు. ఈ సినిమాలో హీరోయిన్ ను గ్లామ‌ర్‌గా తీసుకోవ‌డం స‌రికాద‌న్నారు. ఎన్టీఆర్‌ను ఆక‌ర్షించ‌డానికి లక్ష్మీ పార్వతిలో ఉన్న ప్రత్యేకలేంటో చూపిస్తానని వెల్లడించారు. ఆమె పాత్రలో నటించేందుకు ఎవరికి ఛాన్స్ ఇస్తారన్న ప్రశ్నకు వర్మ సమాధానం దాటవేశారు. రోజా లక్ష్మీ పార్వతి పాత్రను ఫోషిస్తారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

Trending News