Balakrishna As Padma Bhushan: తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం సినీ రంగంతో పాటు సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషికి గాను బాలకృష్ణు పద్మభూషణతో గౌరవించింది. బాలయ్యకు కేంద్రం దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడంతో ఆయనను విష్ చేస్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు చిరంజీవితో పాటు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అరవింద్ సహా పలువరు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే కదా.
తన సేవలను గుర్తించి కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుపై బాలకృష్ణ తొలిసారి స్పందించారు. నాకు అవార్డు ప్రకటించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు. అలాగే నాకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసారు బాలకృష్ణ. మరోవైపు తనతో పాటు పద్మ అవార్డులు తీసుకోబోతున్న వారికి అభినందనలు తెలియజేసారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
బాలకృష్ణ విషయానికొస్తే.. 14వ యేట తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాతమ్మ కల’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తాజాగా ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’సినిమాతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అంతేకాదు వరుస చిత్రాలతో ఇరగదీస్తున్నారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.