Mohanbabu Anti protests: కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుకు వ్యతిరేకంగా నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో నాయీబ్రాహ్మణ సంఘం నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. మోహన్‌బాబు తమకు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మోహన్‌బాబు కుటుంబ సభ్యులకు హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేసిన నాగశ్రీను వ్యవహారమే ఈ నిరసనలకు కారణమవుతోంది.
మోహన్‌బాబుపై, ఆయన కుమారుడు మా అధ్యక్షుడు మంచు విష్ణుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత హైదరాబాద్‌లోనే మొదలైన నిరసనలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు కూడా పాకాయి. నాగశ్రీనుపై అమానుషంగా దాడి చేసి, కులం పేరుతో దూషించి మనస్థాపానికి కారణమైన మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణుపై చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే మానవ హక్కుల కమిషన్‌లో నాయీబ్రాహ్మణ సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. వారిద్దరినీ అరెస్ట్ చేయాలంటూ నిరసనల పర్వం సాగిస్తున్నారు.
మోహన్‌బాబు, మంచువిష్ణులను అరెస్ట్ చేయాలంటూ తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో నాయీ బ్రాహ్మణులు నిరసన చేపట్టారు. రాజమండ్రికి చెందిన నాగశ్రీను దశాబ్దకాలంగా మోహన్‌బాబు ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడని, అలాంటి వ్యక్తిపై దొంగతనం కేసు పెట్టడం, కులం పేరుతో దూషించడం దేనికి నిదర్శనమని నాయీబ్రాహ్మణులు ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలపై దర్యాప్తు జరిపి నిజాల నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. అలాగే, మోహన్ బాబు కుటుంబం వెంటనే నాయి బ్రాహ్మణ సంఘానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Red: RRR Celebration Anthem: 'ఆర్ఆర్ఆర్' అప్ డేట్.. 'ఎత్తర జెండా' సాంగ్ ప్రోమో రిలీజ్..
Also Red: India vs Srilanka: బెంగళూరు టెస్ట్‌లో సరికొత్త రికార్డు, ఏకంగా 16 వికెట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Mohanbabu Anti protests: కొనసాగుతున్న మంచు ఫ్యామిలీ- నాగశ్రీను రచ్చ.. క్షమాపణ చెప్పాలని నాయీబ్రాహ్మణ సంఘాల డిమాండ్
కొనసాగుతున్న నాగశ్రీను- మోహన్ బాబు ఫ్యామిలీ ఫైట్
హైదరాబద్ నుండి ఆంధ్రప్రదేశ్‌కి చేరిన గొడవ
తక్షణం క్షమాపణలు చెప్పాలంటున్న నాయీబ్రాహ్మణ సంఘాలు