Newsense Web Series Review: హీరో నవదీప్, హీరోయిన్ బిందు మాధవి ప్రధాన పాత్రలలో నటించిన వెబ్ సిరీస్ న్యూసెన్స్. ఈ మధ్యకాలంలో తెలుగులో కూడా పెద్ద ఎత్తున వెబ్ సిరీస్ ల నిర్మాణం జరుగుతుంది. గాయం 2, కాళీచరణ్ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన శ్రీ ప్రవీణ్ ఈ వెబ్ సిరీస్ చేశారు. కార్తికేయ 2, ధమాకా, ఇటీవల రామబాణం సినిమాలను నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి ప్రాంతానికి చెందిన ప్రెస్ క్లబ్ లోని స్టింగర్స్ చుట్టూ తిరిగే ఒక ఆసక్తికరమైన కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కించారు. మే 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ న్యూసెన్స్ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది రివ్యూలో చూసి తెలుసుకుందాం
న్యూసెన్స్ కథ ఏమిటి??
శివ(నవదీప్) మదనపల్లెలో రిపబ్లిక్ న్యూస్ ఛానల్ కి రిపోర్టర్ గా పని చేస్తూ ఉంటాడు. శివ క్లాస్మేట్, గర్ల్ ఫ్రెండ్ అయినా సిటీ కేబుల్ ఛానల్ లో యాంకర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక మదనపల్లె ప్రెస్ క్లబ్ లో ఇతర చానల్స్ పత్రికలకు సంబంధించిన రిపోర్టర్లు అందరూ ప్రతి రోజు కలుస్తూ ఉంటారు. ఈ ప్రెస్ క్లబ్ శివ మేనమామ ఈశ్వర్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య జర్నలిస్టులు ఎలా నలిగిపోతున్నారు? ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక ఇద్దరు దగ్గర డబ్బులు తీసుకుని సమన్యాయం చేసే తెలివితేటలు అలాగే సామాన్యులు న్యాయం కోసం పోరాడుతుంటే వారి తరఫున పోరాడలేక రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకుని సైలెంట్గా ఉండిపోతున్న వ్యవహారాలు చర్చిస్తూ ఆసక్తికరమైన కథాంశంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది.
విశ్లేషణ
సాధారణంగా ఫోర్త్ ఎస్టేట్ గా భావించే మీడియాని టార్గెట్ చేస్తూ లేదా మీడియా ఆధారంగా, మీడియా నేపథ్యంగా సాగే సినిమాలు వెబ్ సిరీస్ లు రావడం చాలా అరుదుగా సాగుతూ ఉంటుంది. అయితే డైరెక్టర్ శ్రీ ప్రవీణ్ మీడియాను ప్రధాన అంశంగా ఎంచుకొని ఇలా ఒక వెబ్ సిరీస్ తెరకెక్కించడం సాహసమే. అయితే ఇలాంటి కథను ప్రేక్షకుల ముందుకు ఆసక్తికరంగా తీసుకొచ్చే విషయంలో చాలా వరకు సఫలమయ్యాడు. ఈ న్యూసెన్స్ మొదటి సీజన్లో 6 ఎపిసోడ్లు ఉన్నాయి కానీ కొన్నిచోట్ల అనవసరమైన సీన్లు చూపించి వెబ్ సిరీస్ ను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. మొదటి సీజన్ అంతా పాత్రల పరిచయం, వారి మనస్తత్వం, కొన్ని ఆసక్తికరమైన ట్విస్టులు ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. సాధారణంగా వెబ్ సిరీస్ అయినా సినిమా అయినా చరమాంకానికి వచ్చేసరికి హీరో మంచిగా మారి అందరికీ ఉపయోగపడే పనులు చేస్తుంటాడు. కానీ ఈ వెబ్ సిరీస్ లో అది ఊహించడం కష్టమే. న్యూస్ రాస్తే 200 రాయకపోతే ఈశ్వర్ నోటివెంట చెప్పించిన డైలాగు మాత్రం వెబ్ సిరీస్ మొత్తానికి హైలైట్.
నటీనటుల విషయానికి వస్తే
ఈ వెబ్ సిరీస్ లో నవదీప్ ప్రధాన పాత్రలో కనిపించాడు. నిజానికి నవదీప్ ఇలా ఒక సినిమాలో కానీ వెబ్ సిరీస్ లో గాని కనిపించి చాలా కాలమే అయింది. ఆకలి మీద ఉన్న సింహంలా తన పాత్రలో జీవించాడు ఆయన. చిత్తూరు యాసలో డైలాగులతో రెచ్చిపోయాడు. మంచివాడే అయినా బయటికి చెడ్డవాడిగా ముసుగు వేసుకుని నటించే యువకుడి పాత్రలో జీవించాడు. ఇక బిందు మాధవి కూడా హీరోయిన్ పాత్రలో అదరగొట్టేసింది. అయితే పూర్తిస్థాయిలో ఆమె నటనకు స్కోప్ ఉన్న వెబ్ సిరీస్ అయితే కాదు. పాత్రధారులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.
టెక్నికల్ టీం
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు శ్రీ ప్రవీణ్ రాసుకున్న కథను చాలా వరకు ఆసక్తికరంగా తెరమీద ఆవిష్కరించడంలో సఫలమయ్యాడు. అయితే వెబ్ సిరీస్ కావడంతో అక్కడక్కడ బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ చాలా వరకు క్రిస్పీగా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వెబ్ సిరీస్ కి బాగా ప్లస్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ కూడా వెబ్ సిరీస్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్లింది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి
ఫైనల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే
న్యూస్ సెన్స్ ను న్యూసెన్స్ గా మారుస్తున్న జర్నలిస్టులకు మేలుకొలుపు ఈ సిరీస్
Rating:2.75/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook