Nani: మా ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది అనుకోలేదు.. మొదటిసారి నోరు విప్పిన నాని..!

Nani about his marriage:నాచురల్ స్టార్ నాని తాజాగా తన భార్య అంజన ఎలవర్తితో ప్రేమ కథ నుండి పెద్దలు ఒప్పుకొని పరిస్థితులను కూడా చెప్పుకొచ్చి, ఆ తర్వాత తమ ప్రేమ ఎలా పెళ్లిగా మారింది అనే విషయాలను కూడా వెల్లడించారు.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Nov 23, 2024, 04:14 PM IST
Nani: మా ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది అనుకోలేదు.. మొదటిసారి నోరు విప్పిన నాని..!

Nani about his wife: టాలీవుడ్ స్టార్ హీరో నాని ఈ మధ్యకాలంలో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారిపోయారు. చివరిగా సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన, ఇప్పుడు హిట్ -3 సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తన వ్యక్తిగత జీవితం గురించి కూడా తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు నాని. 

నాని, రానా దగ్గుబాటి హోస్ట్ గా వ్యవహరిస్తున్న చాట్ షోలో తన ప్రేమ విషయాన్ని వెల్లడించారు. నాని మాట్లాడుతూ.. నా భార్య అంజనా.. ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ ఎలవర్తి నాయుడమ్మ గారి మనవరాలు. ఇకపోతే నేను నా భార్య దగ్గర ఆయన డైరీ చూశాను. 
అందులో "నేను ఈరోజు శ్రీమతి ఇందిరా గాంధీని కలిసాను"అని రాసి ఉంది. కొన్ని పేజీల తర్వాత "ఎన్టీఆర్ సార్ తో నా అల్పాహారం తర్వాత!" అని కూడా ఆయన రాసుకున్నారు..

అయితే నేను అంజనాతో ప్రేమలో పడినప్పుడు ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు. చాలా కాలంగా మంచి నేపథ్యం ఉన్న కుటుంబం కోసం ఎదురు చూశాను. అలా అంజనా  నాకు తారసపడింది. ఇక అంజనాతో వివాహం జరగడం ఒక సుదీర్ఘమైన కలలా అనిపించింది. 

నిజంగా చెప్పాలి అంటే మా ప్రేమ, పెళ్లి వరకు వెళ్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే అంజనా ను ప్రేమించాను. ఇక అడుగుపెట్టిన తర్వాత నా ప్రేమ ఉంటుందో ఊడుతుందో అనిపించింది. ముఖ్యంగా నటీనటులుగా భవిష్యత్తు మన కోసం ఏమి ఉంచుతుందో మనకు తెలియదు కదా.. నిజానికి అంజన కుటుంబ సభ్యులందరూ కూడా మంచి విద్యావేత్తలు. 

అయితే ఆ కుటుంబం నన్ను కలిసిన తర్వాత ఒక్కసారిగా వారు నన్ను ఓన్ చేసుకున్నారు. ఇక అప్పటివరకు ఉన్న సందేహాలన్నీ క్లియర్ అయ్యాయి అంటూ తెలిపారు నాని. మొత్తానికి అయితే తాను అనుకున్న విషయాలన్నీ భ్రమ అని,  వారిని కలిసిన తర్వాతే వారు ఎంత మంచివారో అర్థమైందని చెప్పుకొచ్చారు. ఇకపోతే నాని ప్రేమా, పెళ్లి విషయం అందరిని ఆకట్టుకుంటోంది.

Read more: Garikapati Narasimharao: తగ్గెదేలా అంటావా..?.. మీ అందర్ని కడిగేస్తా.. పుష్పా- 2 మీద రెచ్చిపోయిన గరికపాటి.. వీడియో ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News