Nagababu Satirical Tweet on Garikapati narasimha rao goes Viral: ఒకప్పుటి బిజెపి నేత, ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది అలయ్ బలాయ్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా ఆయన నిర్వహించే ఈ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గరికపాటి నరసింహారావు వంటి వారు అతిథులుగా హాజరయ్యారు. గరికపాటి నరసింహారావు ప్రసంగం ప్రారంభిస్తున్న సమయానికి మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీ దిగేందుకు అక్కడికి వచ్చిన చాలామంది జనం ఎగబడ్డారు.
తాను చెబుతున్న ప్రసంగాన్ని సైతం పట్టించుకోకుండా వారంతా మెగాస్టార్ తో సెలవులు తీసుకోవడం కోసం పరుగులు పెడుతూ ఉండడంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. మీరు ఫోటో సెషన్ ఆపితేనే నేను ప్రసంగిస్తానని మెగాస్టార్ చిరంజీవితో గరికపాటి చెప్పడంతో చిరంజీవి అప్పటికప్పుడు సెల్ఫీలు దిగడం మానేశారు. ఇక అప్పటికప్పుడు గరికిపాటి వద్దకు వచ్చి క్షమాపణలు కూడా చెప్పి మీ ప్రసంగాలు అంటే తనకు ఎంతో ఇష్టమని ఎంతో ఆసక్తిగా వింటానని కూడా చెప్పారు.
ప్పటికప్పుడే ఒక రోజు తన ఇంటికి భోజనానికి కూడా రావాలని గరికిపాటిని మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించారు. ఇక అంతే కాకుండా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చాలా కాలంగా ఈ కార్యక్రమానికి రావాలని అనుకుంటున్నానని కానీ ఇప్పటివరకు తనకు ఆ అవకాశం దక్కలేదని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి తన కుటుంబం నుంచి తమ్ముడు పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ వంటి వారు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి మీద గరికిపాటి చేసిన కామెంట్లకు సంబంధించి నాగబాబు గరికపాటి నరసింహారావును ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేశారు.
ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే ..
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022
‘’ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పార్టీ అసూయ పడటం పరిపాటే’’ అంటూ కామెంట్ చేశారు. ఇందులో ఆయన గరికపాటి అని ఎక్కడా మెన్షన్ చేయకపోయినా నాగబాబు ఆయనను ఉద్దేశించే ఈ కామెంట్లు చేసుకుంటారు అనే వాదన వినిపిస్తోంది. దీనికి సంబంధించి నాగబాబు అధికారికంగా స్పందిస్తే గాని అది ఎంతవరకు నిజం అనేది చెప్పలేని పరిస్థితి.
Also Read: OTT Releases Tomorrow: ఓటీటీలో సందడి చేయనున్న తెలుగు సినిమాలు, వెబ్ సిరీసుల లిస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook