Naga Chaithanya : అలాంటివేమైనా ఉంటే ధైర్యంగా ఓపెన్‌గా చెబుతా.. నాగ చైతన్య

Naga Chaithanya Crush నాగ చైతన్య తాజాగా తన క్రష్‌ గురించి చెప్పాడు. అలాంటివి ఏమైనా ఉంటే.. నేను ఎప్పుడూ ఓపెన్‌గానే చెబుతాను అని అన్నాడు. తనకు హాలీవుడ్ నటి అంటే క్రష్ ఏర్పడిందని, ఇటీవలే ఆమె సినిమా చూసి, నటన చూసి ఫిదా అయ్యానని అన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2023, 10:09 AM IST
  • నెట్టింట్లో కస్టడీ సందడి షురూ
  • ప్రమోషన్స్‌లో బిజీగా నాగ చైతన్య
  • క్రష్ గురించి నాగ చైతన్య ఓపెన్
Naga Chaithanya : అలాంటివేమైనా ఉంటే ధైర్యంగా ఓపెన్‌గా చెబుతా.. నాగ చైతన్య

Naga Chaithanya Crush నాగ చైతన్య తాజాగా కస్టడీ మూవీ కోసం బయటకు వచ్చాడు. ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు ముందు నుంచే చైతూ బయటకు వచ్చాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బంగార్రాజు సినిమా తరువాత మళ్లీ ఇలా వెంటనే నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా నటించారు. ఇప్పుడు ఈ సినిమా మీద తమిళం, తెలుగులో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

టీజర్, ఫస్ట్ లుక్ ఇలా అన్నీ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. వచ్చే వారం ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. అందుకే ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టాడు నాగ చైతన్య.  ఈక్రమంలో తమిళంలో ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఇస్తూ మీడియాతో సందడి చేస్తున్నాడు. నాగ చైతన్య ఇప్పుడు కొన్ని విషయాలను బయటపెట్టాడు.

జీవితంలో ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డ సంఘటనలు, బాధపడ్డ విషయాలున్నాయా? అని అడిగితే.. అలాంటివేమీ లేవని, జీవితంలో జరిగితే ప్రతీ ఘటన ఏదో ఒకటి నేర్పింస్తుందని, కానీ తాను రెండు మూడు సినిమాల విషయంలో బాధపడ్డాను, ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నానా? అని పశ్చాత్తాపడ్డాను అంటూ తన సినిమాల గురించి నాగ చైతన్య చెప్పాడు. అలా ఓ మూడు సినిమాలున్నాయని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.

క్రష్ గురించి చెప్పమని చైతూని అడిగితే.. అలాంటి విషయాల్లో సీక్రెట్ ఏమీ లేదు.. అలాంటివి ఏమైనా ఉంటే నేను ఓపెన్‌గా డైరెక్ట్‌గా చెబుతాను.. బేబీలాన్ అనే ఓ సినిమాను రీసెంట్‌గా చూశాను. అందులో మార్గట్ రోబీ అద్భుతంగా నటించింది. నాకు ఆమె నటన అంటే ఇష్టం. ఆమె అంటే కూడా ఇష్టం ఏర్పడింది అంటూ తన క్రష్‌ గురించి చెప్పుకొచ్చాడు.

Also Read:  Akhil Agent : నాగ చైతన్య కంటే దారుణంగా అఖిల్.. ఇక సమంత అయితే అంతకు మించి

ఇక నాగ చైతన్య పర్సనల్ కెరీర్‌ మాత్రం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. సమంతతో విడిపోయిన తరువాత నాగ చైతన్య మీద ఎన్నో రూమర్లు వచ్చాయి. శోభితతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడని, న్యూయార్క్, లండన్ అంటూ ఇలా తిరిగేస్తున్నాడని వార్తలు వచ్చాయి. మరి వీటిపై నాగ చైతన్య స్పందిస్తాడా? లేదా? అన్నది చూడాలి.

Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News