Nagarjuna on Samantha Divorce: "విడాకులు అడిగింది సమంతనే".. నాగార్జున సంచలన వ్యాఖ్యలు

Nagarjuna on Samantha Divorce: నాగచైతన్య, సమంత విడాకులపై అక్కినేని నాగార్జున తొలిసారి మీడియా ముఖంగా స్పందించారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున.. నాగచైతన్య, సమంత విడిపోవడానికి వెనకున్న కారణాలను చెప్పారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 02:50 PM IST
    • నాగచైతన్య, సమంత విడాకులపై నాగార్జున స్పందన
    • సమంత ఇష్ట ప్రకారమే ఇది జరిగిందని వ్యాఖ్య
    • కుటుంబం పరువు కోసమే నాగచైతన్య ఆలోచించాడని వెల్లడి
Nagarjuna on Samantha Divorce: "విడాకులు అడిగింది సమంతనే".. నాగార్జున సంచలన వ్యాఖ్యలు

Nagarjuna on Samantha Divorce: టాలీవుడ్ లవ్ కపుల్ లో నాగచైతన్య, సమంత అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అయితే గతేడాది అక్టోబరులో వీరిద్దరూ విడిపోతున్నారనే వార్త వినగానే అక్కినేని అభిమానుల్లో కలవరం మొదలైంది. వీరిద్దరూ ఎందుకు విడిపోయారనే విషయంపై స్పష్టత లేకపోయినా.. సోషల్ మీడియాలో అనేక వాదనలు వినిపించాయి. 

పెళ్లి తర్వాత సమంత నటించేందుకు అక్కినేని కుటుంబం ఒప్పుకోలేదని కొందరు ఊహాగానాలు గుప్పించగా.. మరికొందరు సమంత పెళ్లి తర్వాత కూడా హీరోలతో రొమాన్స్ చేయడం నచ్చక విడిపోయారనే వాదన వినిపిస్తుంది. అయితే దీని గురించి ఎవరికి స్పష్టత రాలేదు. కానీ, ఈ విషయంపై నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున తొలిసారి స్పందించారు. 

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్కినేని నాగార్జున.. నాగచైతన్య, సమంత విడిపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. "నాగచైతన్య ఆమె నిర్ణయాన్ని అంగీకరించాడు. కానీ, కుటుంబ పరువు ఏమైపోతుందోనని చైతన్య చాలా ఆలోచించాడు. ఇదే విషయమైన అనేకసార్లు ఆందోళన చెందాడు" అని నాగార్జున వెల్లడించారు. 

"సమంతతో విడాకుల తర్వాత చైతన్య నన్ను చాలా ఓదార్చాడు. నాలుగేళ్ల పాటు వాళ్లిద్దరూ వివాహబంధంలో కొనసాగారు. కానీ, అంతకుముందు వారిద్దరి మధ్య ఈ సమస్య రాలేదు. గతేడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను కూడా ఇద్దరు కలిపి జరుపుకున్నారు. కానీ, ఆ తర్వాతే వారిద్దరి మధ్య సమస్య తలెత్తినట్లు ఉంది" అని అక్కినేని నాగార్జున స్పష్టం చేశారు.  అయితే ఆ ఇంటర్వ్యూలో అడిగిన మరో ఆసక్తి ప్రశ్నకు కూడా నాగార్జున సమాధానమిచ్చారు. నాగచైతన్య పక్కన ఆన్ స్క్రీన్ హీరోయిన్ గా మీరు ఎవర్ని ఎక్కువగా ఇష్టపడతారనే ప్రశ్నకు.. సమంత అని నాగ్ జవాబిచ్చారు. 

నాగచైతన్య, సమంత.. 2010లో గౌతమ్ మేనన్ దర్శకత్వంలో రూపొందిన 'ఏమాయ చేశావే' సినిమాలో తొలిసారి కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ లోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. 

కొంతకాలం డేటింగ్ తర్వాత 2017 అక్టోబరు 6 గోవాలో వీరిద్దరి వివాహం జరిగింది. ఆ తర్వాత అక్టోబరు 7న క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం పెళ్లైంది. దాదాపుగా నాలుగేళ్ల వివాహబంధం తర్వాత వీరిద్దరూ గతేడాది అక్టోబరులో విడిపోనున్నట్లు ప్రకటించారు.  

Also Read: Mouni Roy Wedding: గోవాలో మౌనీరాయ్ పెళ్లి.. హల్దీ ఫంక్షన్ లో నాగిని బ్యూటీ సందడి

Also Read: Pia Bajpiee Photos: రంగం సినిమా హీరోయిన్ ఇప్పుడెలాగ ఉందో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News