Kalki 2898 AD: కొత్త రికార్డు సాధించిన కల్కి.. ఇతనే దీనంతటికీ కారణం అంటున్న నాగ్ అశ్విన్

Kalki 2898 AD Collections: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ కాంబినేషన్లో విడుదలైన కల్కి 2898 ఏడి.. సినిమా ఆరవ రోజు కూడా అత్యధిక కలెక్షన్లు అందుకున్న.. సినిమాగా రికార్డు సృష్టించింది. తాజాగా సినిమా సూపర్ సక్సెస్ కి కారణం ఇతనే అంటూ నాగ్ అశ్విన్ షేర్ చేసిన ఫోటో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 3, 2024, 08:47 PM IST
Kalki 2898 AD: కొత్త రికార్డు సాధించిన కల్కి.. ఇతనే దీనంతటికీ కారణం అంటున్న నాగ్ అశ్విన్

Kalki 2898 AD Records: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా.. అద్భుతమైన కలెక్షన్లు అందుకుంటుంది. మొదటి రోజు నుంచి కలెక్షన్ల మోత మోగిస్తున్న.. ఈ సినిమాని అశ్విని దత్ వైజయంతి మూవీస్ పతాకంపై 600 కోట్ల బడ్జెట్ తో.. నిర్మించారు. తాజాగా సినిమా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ నాగ అశ్విన్ ప్రభాస్.. గురించి అదిరిపోయే పోస్ట్ పెట్టారు. 

“చాలా క్యాజువల్ గా అక్కడ కూర్చున్న ఆ మనిషి దీనంతటికీ కారణం. ఎటువంటి సందేహం లేకుండా బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ స్టార్ ఇతనే. మేము ఏం చేసినా అది ఇతను మా నిర్మాణ సంస్థకు ఇచ్చిన కాన్ఫిడెన్స్. నేను ఏం చేయాలి అనుకున్నా.. నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. చాలామంది ఇచ్చిన ఇన్ పుట్స్ కూడా నన్ను సరైన మార్గంలో తీసుకువెళ్లి సినిమాని ఇలా మార్చాయి. అందరి డార్లింగ్, మా భైరవ, ఇప్పుడు ప్రపంచంలో అందరికీ కే" అంటూ నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ బ్యానర్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు.

 

అంతేకాకుండా ప్రభాస్ సెట్స్ మీద కూర్చుని ఉన్న ఫోటోని ఈ ట్వీట్ తో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో.. తెగ వైరల్ గా మారింది. భైరవ లుక్ లో ప్రభాస్ సెట్స్ మీద చాలా క్యాజువల్ గా కూర్చొని ఉన్నారు. మరోవైపు ప్రభాస్ సినిమా కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో రికార్డు సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

విడుదలైన ఆరు రోజుల్లోనే సినిమా 680 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసుకుని ట్రేడ్ వర్గాలకు సైతం షాక్ ఇచ్చింది. వారాంతంలో రోజుకి 100 కోట్లకు.. పైగా కలెక్షన్లు నమోదు చేసుకున్న ఈ సినిమా సోమా మంగళవారాల్లో కూడా 50 కోట్ల కంటే ఎక్కువ గానే వసూలు చేసినట్లు సమాచారం. మళ్ళీ వారాంతం రాబోతోంది కాబట్టి ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. 

మొదటి రోజు నుంచి అద్భుతమైన కలెక్షన్లు అందుకుంటున్న ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ ని ఏలుతుంది. యునానిమస్ బ్లాక్ బస్టర్.. టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకి ప్రాఫిట్ ల వర్షం కురిపిస్తుంది. నిన్న మొన్నటిదాకా మూతపడి ఉన్న.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సైతం
పూర్వ వైభవం తీసుకొచ్చిన సినిమా ఇది అని.. ఈ చిత్రం గురించి.. సినీ విశేషకులు సైతం మెచ్చుకుంటున్నారు.

Also Read: Mokshagna: బిగ్‌ బ్రేకింగ్‌.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

Also Read: Mahesh Babu: అభిమాని పాలిట మహేశ్‌ బాబు దేవుడు.. పేదింట చదువుల వెలుగులు నింపిన సూపర్‌స్టార్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News