Mrunal Thakur: రూట్ మారుస్తున్న మృణాల్…ప్రయోగాలు అవసరమా అంటున్న అభిమానులు..

Mrunal Thakur Next: సీతా రామమ్ మూవీ లో సీత పాత్ర తో టాలీవుడ్ కి పరిచయమైన మృణాల్ ఠాకూర్ ..తన డీసెంట్ లుక్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఈ భామ ఇప్పుడు తన రూట్ మారుస్తోంది. కూల్ అండ్ ఎమోషనల్ మూవీస్ కాకుండా మృణాల్  కమర్షియల్ మూవీస్ వైపు దృష్టి పెడుతోంది అని టాక్.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2024, 12:38 PM IST
Mrunal Thakur: రూట్ మారుస్తున్న మృణాల్…ప్రయోగాలు అవసరమా అంటున్న అభిమానులు..

Family Star: మృణాల్ ఠాకూర్.. పేరులో తెలుగుతనం లేకపోయినా.. చూడడానికి అచ్చు పదహారణాల తెలుగు పిల్లలా ఉంటుంది. పైగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాలో ఆమె చేసిన పాత్ర అందరిని మైమరిపించింది. అప్పటినుంచి టాలీవుడ్ సీతగా సెటిల్ అయిపోయింది మృణాల్. ఈ మూవీ తర్వాత ఆమె చేసిన హాయి నాన్న,  ఫ్యామిలీ స్టార్  కూడా డీసెంట్ ఎమోషనల్ మూవీస్ కావడం ఆమెకు మరింత క్రేజ్ తెచ్చింది.

దీంతో ప్రేక్షకులు ఆమెను ఎక్కువగా ఫ్యామిలీ మూవీస్ లో చూడడానికి ఇష్టపడుతున్నారు.అయితే మొదటిసారి మృణాల్ కమర్షియల్ వైపు ఫోకస్ చేస్తోంది అని టాక్ వినిపిస్తోంది. ఓ భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట కు మృణాల్ హీరోయిన్ గా సెట్ అయింది అన్న వార్త రెండు నెలల క్రితమే బయటికి వచ్చింది. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. గత కొద్దికాలంగా ఈ మూవీ స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్న దాస్ ఫైనల్ గా స్క్రిప్ట్ ను ఒక కొలిక్కి తీసుకువచ్చారట. అయితే ఈ మూవీలో మల్టీస్టారర్ హంగులు కూడా ఉండబోతున్నాయని టాక్.

మూవీలో ఒక కీలక పాత్ర కోసం మోహన్ లాల్ ఓకే చెప్పారట. జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మోహన్ లాల్.. మంచి పవర్ఫుల్ పాత్రలకు బాగా సెట్ అవుతాడు అనే ఉద్దేశంతో ఆయను ఈ పాత్ర కోసం సంప్రదించారట. తుపాకీ మూవీ విలన్ విద్యుత్ జమాల్ తో పాటు టాలీవుడ్ కు చెందిన మీడియం స్టార్ హీరో ఈ మూవీలో భాగం చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఇంకా ఆ పాత్ర పోషించే హీరో పేరు వెల్లడించలేదు. అయితే ఈ చిత్రంలో మృణాల్ పక్కా గ్లామర్ పాత్ర ఒప్పుకున్నట్టు వినికిడి. 

బాలీవుడ్ లో గ్లామర్ షో కి వెనకాడని మృణాల్.. టాలీవుడ్ లో మాత్రం ఫ్యామిలీ రోల్స్ కే ఓకే అంటోంది. అయితే క్రమంగా ఈ నిర్ణయంలో మార్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అది కూడా ఈ ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచే మొదలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకమీదట ఒకవేళ తనకు గ్లామర్ రోల్స్ వచ్చిన మృణాల్ ఒప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం గురించి ఆమె సౌత్ అభిమానులు మాత్రం తెగ ఫీలవుతున్నారు. ఇప్పటివరకు మీ హీరోయిన్ కి తన సినిమాల ఎంపిక వల్లే తెలుగులో మంచి పేరు ఉంది…మరి తను కూడా అందరూ హీరోయిన్స్ లాగా కమర్షియల్ వైపు మొగ్గు చూపితే.. అది తన కెరియర్ పైన సౌత్ లో నెగిటివ్ ప్రభావం చూపించవచ్చన ఆమె అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఏప్రిల్ 5న విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ మంచి బ్రేక్ ఇస్తుంది అనే ఉద్దేశంతో ఇప్పటివరకు మృణాల్ ఇంకా ఏ మూవీస్ కు కమిట్మెంట్ ఇవ్వలేదట. అందుకే ఈ మురుగదాస్ సినిమా ఒప్పుకున్న ఇంకా ఆ సినిమాకి  డేట్స్ క్లారిటీ ఇవ్వలేదని వినిపిస్తోంది. 
విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ రిజల్ట్ ను బట్టి ఆమె రెమ్యూనరేషన్ పెంచాలి అని భావిస్తుందో.. లేక కాస్త స్టార్ డమ్ పెరిగాక ఇలా కమర్షియల్ సినిమాల వైపు మొగ్గు చూపడం మొదలు పెడదాం అనుకుంటున్న తెలియదు కానీ .. ప్రస్తుతానికి మాత్రం ఈ హీరోయిన్ ఆచితూచి అడుగులు వేస్తోంది. మరి మృణాల్ తీసుకునే నిర్ణయం ఆమెకు ఎలాంటి ఫలితం తెచ్చి పెడుతుందో చూడాలి.

Also Read: KTR Viral Tweet: శభాష్‌ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్‌ ప్రశంసలు

Also Read: TN Assembly: తమిళనాడులో 'జనగణమన' రచ్చ.. అసెంబ్లీని బహిష్కరించిన గవర్నర్‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News