Ban On Mirzapur 2: వెబ్‌ సిరీస్‌ ‘మీర్జాపూర్‌ 2’పై నిషేధం విధించాలని డిమాండ్!

వెబ్‌ సిరీస్‌ ‘మీర్జాపూర్‌ 2’ (Ban On Mirzapur 2)పై నిషేధం విధించాలని డిమాండ్ మొదలైంది. మీర్జాపూర్‌ను అసమానలతో చూపిస్తున్నారని, హింసాత్మక ఘటనలకు కేంద్రంగా చూపించి పేరు చెడగొడుతున్నారంటూ అప్నాదల్ ఎంపీ అనుప్రియా పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖలు రాశారు.

Last Updated : Oct 25, 2020, 04:27 PM IST
  • గ్యాంగ్‌ వార్‌ నేపథ్యంలో సాగే వెబ్‌ సిరీస్‌ మీర్జాపూర్‌ 2 అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల
  • మీర్జాపూర్ ప్రాంతాన్ని తప్పుగా చూపిస్తున్నారని వెబ్ సిరీస్ బ్యాన్ చేయాలని డిమాండ్
  • ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు ఎంపీ అనుప్రియా పటేల్ లేఖలు
Ban On Mirzapur 2: వెబ్‌ సిరీస్‌ ‘మీర్జాపూర్‌ 2’పై నిషేధం విధించాలని డిమాండ్!

వెబ్‌ సిరీస్‌ ‘మీర్జాపూర్‌ 2’ (Mirzapur 2 Web Series)పై నిషేధం విధించాలని అప్నాదల్‌ ఎంపీ అనుప్రియా పటేల్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ ఎంపీగా ఆమె సేవలు అందిస్తున్నారు. 2019 ఎన్నికల్లో రెండో పర్యాయం మీర్జాపూర్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో ప్రసారమయ్యే ‘మీర్జాపూర్ 2’ వెబ్‌ సిరీస్‌ జాతి అసమానతలను వ్యాప్తి చేసి హింసకు దారి తీసేలా కనిపిస్తుందని ఎంపీ అనుప్రియా పటేల్ ఆరోపించారు. మీర్జాపూర్‌ అనే ప్రాంతాన్ని ఓ హింసాత్మక ప్రదేశంగా చూపిస్తూ.. ఇక్కడి వారిని అవమానిస్తున్నారని మండిపడ్డారు.

 

అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో అక్టోబర్ 23 నుంచి మీర్జాపూర్‌ 2 అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంలో ప్రశాంతకు కేంద్ర బిందువుగా ‘మీర్జాపూర్‌’ ప్రాంతం ఉందన్నారు. అయితే అలాంటి ప్రాంతం పేరుతో హింసాత్మకతను రెచ్చెగొట్టేలా ఉన్న వెబ్‌సిరీస్ ‘మీర్జాపూర్ 2’పై సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టి బ్యాన్ చేయాలని అనుప్రియా పటేల్ డిమాండ్ చేశారు.

 

గ్యాంగ్‌ వార్‌ నేపథ్యంలో సాగే వెబ్‌ సిరీస్‌ మీర్జాపూర్‌‌కు కొనసాగింపుగా అమెజాన్‌ ప్రైమ్‌లో మీర్జాపూర్‌ 2 విడుదలైంది. శ్వేత త్రిపాఠి శర్మ, పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ను నిషేధించాలని వాదన మొదలైంది.  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News