Mehreen Pirzada : నా కెరీర్‌లో మొదటి సారి ఆ పని చేస్తున్నాను.. ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.. మెహ్రీన్ కామెంట్స్ వైరల్

Mehreen Pirzada First Experience మెహ్రీన్ తాజాగా తన తొలి అనుభవం గురించి చెప్పింది. ఆకాశంలో విహరించాలని కొంత మందికి ఉంటుంది. అడ్వెంచర్లు చేయడం కొంత మందికి ఇష్టముంటుంది. తాజాగా మెహ్రీన్ స్కై డైవ్ చేసి తన కోరికను తీర్చుకున్నట్టుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2022, 05:56 PM IST
  • మెహ్రీన్ తొలి అనుభవం ఇదేనట
  • ఆకాశంలో విహరించేసిన హీరోయిన్
  • నెట్టింట్లో మెహ్రీన్ వీడియో వైరల్
Mehreen Pirzada : నా కెరీర్‌లో మొదటి సారి ఆ పని చేస్తున్నాను.. ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.. మెహ్రీన్ కామెంట్స్ వైరల్

Mehreen Pirzada First Experience మెహ్రీన్ ప్రస్తుతం సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తోంది. మెహ్రీన్‌కు సినిమా అవకాశాలు ఇస్తే.. డైరెక్టర్ మారుతి లేదా అనిల్ రావిపూడి ఇవ్వాల్సిందే. మారుతి ఇప్పుడు ప్రభాస్ సినిమా చేస్తున్నాడు. అందులో మెహ్రీన్‌కు చాన్స్ ఇవ్వలేడు. ఇస్తే అభిమానులు ఊరుకోరు. ఇక అనిల్ రావిపూడి అయితే ఎఫ్ 3 సినిమాతోనే మెహ్రీన్‌ను సరిపెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. బాలయ్య సినిమాలో ఆమెకు చాన్స్ ఇచ్చినట్టుగా కనిపించడం లేదు.
ఇక ఇతర దర్శకుల దృష్టిలో మెహ్రీన్ ఉందో లేదో కూడా తెలియడం లేదు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

మెహ్రీన్ తన ఎంగేజ్మెంట్‌ను బ్రేక్ చేసుకుంది. పెళ్లి పీటల ఎక్కకకముందే రద్దు చేసుకుంది. అయితే ఇప్పుడు మెహ్రీన్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. మెహ్రీన్ మొదటి సారిగా ఈ పని చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. స్కై డైవ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుందట. మొత్తానికి ఇప్పుడు ఆ పని చేసేందుకు అబుదాబికి వచ్చానని, స్కై డైవ్ చేయబోతోన్నట్టుగా చెప్పేసింది. స్కై డైవ్ చేయబోతోన్నానని ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పుకొచ్చింది.

ఇక ఆకాశంలో అలా గాల్లో తేలిపోయిన మెహ్రీన్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆకాశ వీధుల్లో అలా విహరించిన మెహ్రీన్ ఫుల్ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. కిందకు దిగి వచ్చిన మెహ్రీన్‌ను ఇలా అడిగేశాడు ఆ నిర్వహకుడు. మీరు ఆకాశంలో బాగానే భయపడినట్టున్నారు. ఎలా అనిపించింది.. ఆ అనుభవం ఎలా ఉంది? అని అడిగేశాడు. నేను పైన భయపడలేదు.. డ్యాన్స్ చేసినట్టుగా ఉన్నాను.. ఆ అనుభవం ఎంతో అద్భుతంగా ఉంది అంటూ ఫుల్ ఎగ్జైట్ అయింది మెహ్రీన్.

Also Read : Nayanthara-Jr NTR : ప్రభాస్ చిన్న పిల్లాడు.. రవితేజతో గ్యాప్ వచ్చింది.. నయనతార కామెంట్స్ వైరల్

Also Read : Nandamuri Taraka Ratna : ఎన్టీఆర్‌ది నందమూరి రక్తం.. యంగ్ టైగర్‌పై తారకరత్న కామెంట్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News