Mehaboob Dilse: మెహబూబ్ ఇంట తీవ్ర విషాదం.. ఎలా బతకాలి అంటూ ఎమోషనల్ గా!

Mehaboob Dilse Mother Passed Away: మెహబూబ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మెహబూబ్ తల్లి సుమారు నెలరోజుల క్రితం మరణించినట్లు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 7, 2022, 09:59 AM IST
 Mehaboob Dilse: మెహబూబ్ ఇంట తీవ్ర విషాదం.. ఎలా బతకాలి అంటూ ఎమోషనల్ గా!

Mehaboob Dilse Mother Passed Away Due to Heart Stroke: సోషల్ మీడియా స్టార్ గా చాలా మందికి పరిచయమై బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమైన మెహబూబ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మెహబూబ్ తల్లి సుమారు నెలరోజుల క్రితం మరణించినట్లు తెలుస్తోంది. తాజాగా తన సోషల్ మీడియా ద్వారా మెహబూబ్ తన తల్లి చనిపోయినట్లుగా వెల్లడించాడు. ఈ క్రమంలో ఒక ఎమోషనల్ నోట్ కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అమ్మ, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు, నేను ఎలా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి? నేను ఇప్పుడు రోజు ఎవరితో మాట్లాడాలి? నువ్వు లేకుండా ఎలా బతకాలి అమ్మ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.

నువ్వు లేకుండా ఒక జీవితం ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు, నన్ను ఎప్పుడూ ఏదీ చేయవద్దని నువ్వు చెప్పలేదు, నేను ఒక్కో అడుగు వేస్తూ ఎదగడాన్ని కూడా నువ్వు చూసావు అంటూ అమ్మ మీద ప్రేమను బయటపెట్టాడు. ఇక నా అన్ని కష్టసుఖాల్లో నువ్వు తోడున్నావు, ఎప్పుడూ నీ మాటలతో నన్ను ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నావు, ఆ మాటలే నన్ను ఎప్పుడూ మోటివేట్ అయ్యేలా చేస్తూ ఉంటాయని అన్నారు. మా కోసం నువ్వు చాలా ఫైట్ చేశావు, మమ్మల్ని బాగా చూసుకోవడం కోసం నువ్వు జీవితంతో ఎంతో పోరాడావని అన్నారు. మా కోసం ఎవరూ చేయనంతగా నువ్వు అన్నీ చేశావు, నువ్వు మాకోసం అన్నీ త్యాగం చేశావు.

నువ్వు లేకుండా నా జీవితం ఎటు వెళుతుందో నేను చెప్పలేనమ్మా, నిన్ను ప్రతి సెకండ్ మిస్ అవుతున్నాను. జీవితం అంటే ఏంటో నువ్వే నేర్పించావు అమ్మ, నాకు తెలుసు నువ్వు నన్ను చూస్తున్నావని అన్నాడు. కచ్చితంగా చెబుతున్నాను నేను నిన్ను గర్వపడేలా చేస్తాను, నాన్నను, సుభాన్ ను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని నేను నీకు మాటిస్తున్నానని అన్నారు. జూలై 5వ తేదీన నాకు ఒక కాళరాత్రి, అన్నీ సెకండ్ల వ్యవధిలో జరిగిపోయాయి. ఆమెకు హాట్ స్ట్రోక్ వచ్చి మమ్మల్ని కన్నీళ్ళలో వదిలి వెళ్ళిపోయిందని పేర్కొన్నారు.

ఆమెను మీ ప్రార్థనలలో గుర్తు చేసుకోండి, జీవితం ఎవరూ ఊహించనిది స్నేహితులారా మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే ఆ విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పండని అన్నాడు. అమ్మ నీ జ్ఞాపకాలని మా జీవితమంతా గుర్తుపెట్టుకుంటాం, మా హృదయాలలో నీ స్థానాన్ని ఎవరూ సంపాదించలేరు అంటూ మెహబూబ్ ఒక సుధీర్ఘ ఎమోషనల్ నోట్ షేర్ చేసుకున్నాడు. దీంతో పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలు ఆయనకు ధైర్యం చెబుతున్నారు. బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణ, ఆర్జే చైతు, ఆర్జె కాజల్, సిరి హనుమంతు, శ్రీరామచంద్ర, యాంకర్ రవి, లాస్య, అశురెడ్డి, నోయల్ సీన్ వంటి వారు మహబూబ్ కు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Karthikeya 2 Trailer 2: శ్రీకృష్ణుడే ఎంచుకున్న వైద్యుడితడు.. అమాంతం అంచనాలు పెంచేసిన రెండో ట్రైలర్

Also Read: Kalyan Ram: మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అయితే మరి చిరంజీవి ఎవరు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News