Mega Daughter Divorce Rumours: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విడాకులు..?? రూమర్లకు చెక్ పెట్టిన కళ్యాణ్ దేవ్

నాగ చైతన్య - సమంత లాగానే మెగా కుటుంబలో కూడా ఒక జంట విడిపోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి అల్లుడు కళ్యణ్ దేవ్ ఈ పుకార్లకు చెక్ పెడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 05:46 PM IST
  • మెగా కుటుంబలో కూడా విడాకులు అంటూ రూమర్లు
  • పుకార్లకు చెక్ పెట్టిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్
  • సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన మెగా విడాకుల పుకార్లు
Mega Daughter Divorce Rumours: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విడాకులు..?? రూమర్లకు చెక్ పెట్టిన కళ్యాణ్ దేవ్

 Mega Daughter Divorce Rumours: సమంత -నాగ చైతన్య (Samantha Nagachaitanya) విడాకుల తరువాత చాలా పుకార్లు పుట్టుకొస్తున్నాయి.. ఈ మధ్యే మెగా ఫ్యామిలీలో కూడా ఒక జంట విడాకులు తీసుకోబోతున్నారని టాక్ వచ్చింది. అంతేకాదండోయ్ ఇది సోషల్ మీడియాలో దుమారం కూడా లేపింది.. అదేంటంటే.. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ-కళ్యాణ్ దేవ్ (Sreeja- Kalyan Dev) దంపతులు మధ్య మనస్పర్థాలు ఏర్పడ్డాయని.. ఈ ముచ్చట విడాకుల వరకు వెళ్లిందని ప్రచారం జరిగింది. 

ఈ పుకార్లకు నిజమానేలా మరో సాక్ష్యం కూడా తెచ్చారు పుకార్ల రాయుళ్లు.. ఎప్పుడైనా చిరంజీవి (Chiranjeevi) ఇంట్లో ఫ్యామిలీ జరిగే కుటుంబ కార్యకలాపాల్లో కళ్యాణ్ దేవ్ (Kalyan Dev) ఖచ్చితంగా ఉంటాడని.. ఈ సారి జరిగిన దీపావళి సంబరాల్లో (Deepavali) మెగా కుటుంబ (Mega Family) సభ్యులు అందరు ఉన్నప్పటికీ.. ఒక కళ్యాణ్ దేవ్ లేడని.. దీనికి కారణం మనస్పర్థాలే అని దుమారం లేపారు. అంతేకాకూండా సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) అందరు మెగా హీరోలు ఫోటోలో ఉన్నారు.. ఒక కళ్యాణ్ దేవ్ మాత్రం లేదని... అక్కినేని కుటుంబంలో జరిగిందే.. మెగా కుటుంబలో జరగనుంది అని వార్త తెగ చక్కర్లు కొట్టింది. 

Also Read: Viral Video: RRR 'నాటు నాటు' పాటకు బామ్మ డ్యాన్స్.. ఎనర్జీకి ఫిదా అవుటున్న నెటిజన్లు

ఫిల్మ్ సిటీలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తకు చెక్ పెడుతూ.. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ఒక పోస్ట్ పెట్టారు.. అదేంటంటే.. చిరంజీవి చిన్న కూతురు  శ్రీజ బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటమే కాకుండా "హ్యాపీ బర్త్ డే స్వీటు" అంటూ శ్రీజను ట్యాగ్ చేసాడు.. 

ఇక ఈ పోస్ట్ తో పుకార్లరాయుళ్ల నోర్లు మూతపడేలా చేసాడు మన మెగా అల్లుడు.. విజేత (Vijetha Movie) సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన కళ్యాణ్ దేవ్ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.. షూటింగ్ కొనసాగుతున్న ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

Also Read: Flex Fuel Engines: గుడ్ న్యూస్..తగ్గనున్న పెట్రో-డీజిల్ ధరలు..లీటర్‌కు రూ.62: నితిన్ గడ్కరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

  

Trending News