Meera Jasmine Saree Pics : మీరా 'జాస్మిన్' లాంటి అందం.. చీరకట్టుకే కొత్తదనం వచ్చిందా?

Meera Jasmine in Saree మీరా జాస్మిన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. తాజాగా చీరకట్టులో కనిపించింది. నిజంగానే జాస్మిన్ పువ్వులా మెరిసింది మీరా జాస్మిన్. ఆమె ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 05:00 PM IST
  • నెట్టింట్లో మీరా జాస్మిన్ సందడి
  • ఫోటో షూట్లతో నెటిజన్లకు వల
  • చీరకట్టులో కవ్విస్తోన్న జాస్మిన్ అందం
Meera Jasmine Saree Pics : మీరా 'జాస్మిన్' లాంటి అందం.. చీరకట్టుకే కొత్తదనం వచ్చిందా?

Meera Jasmine Photoshoot మీరా జాస్మిన్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా ఆమె వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. ఆమె చేసిన పాత్రలు ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి. కేరళ కుట్టి అయిన మీరా జాస్మిన్ తన అందం, నటనతో తెలుగు వారిని ఇట్టే కట్టిపడేసింది. తమిళం, మలయాళంలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న మీరా జాస్మిన్ ఆ తరువాత ఎప్పుడో మెల్లిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

అమ్మాయి బాగుంది అనే సినిమాతో మీరా జాస్మిన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే డబుల్ యాక్షన్ చేసింది. ఒకటి మోడ్రన్ పాత్రలో ఉంటే.. ఇంకోటి పద్దతైన అమ్మాయి పాత్రలో కనిపిస్తుంటుంది. అలా ఈ సినిమాతో మీరా జాస్మిన్‌కు మంచి ఇమేజ్ వచ్చింది. ఆ తరువాత మీరా జాస్మిన్‌కు వరుసగా ఆఫర్లు వచ్చాయి.

పవన్ కళ్యాణ్‌తో చేసిన గుడుంబా శంకర్ సినిమాతో మీరా జాస్మిన్‌కు ఫుల్ క్రేజ్ వచ్చింది. అందులో మీరా జాస్మిన్ లుక్స్, అందం, నటనకు అంతా ఫిదా అయ్యారు. సాంగ్స్‌లో అయితే మీరా జాస్మిన్‌ మరో లెవెల్లో చూపించేశారు. అలా మీరా జాస్మిన్‌కు తెలుగులో మంచి సినిమాలు పడ్డాయి.

భద్ర సినిమా కూడా ఆమె కెరీర్‌లో నిలిచిపోయే చిత్రంగా మిగిలింది. రవితేజ, మీరా జాస్మిన్ జోడికి మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆ తరువాత ఆమె చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. గోపీచంద్ హీరోగా వచ్చిన రారాజు సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. బాలయ్యతో చేసిన మహారథి కూడా ఫ్లాప్ అయింది.

అలా చివరగా యమగోల మళ్లీ మొదలైంది అనే సినిమాలో కనిపించింది మీరా జాస్మిన్. ఆ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో మీరా జాస్మిన్‌కు మళ్లీ తెలుగులో కనిపించలేదు. చాలా రోజుల తరువాత గోరింటాకు సినిమాతో బ్రేక్ వచ్చినట్టు అయింది. మా ఆయన చంటి పిల్లాడు, బంగారు బాబు, అ ఆ ఇ ఈ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ఆ తరువాత మరో రెండు సినిమాల్లో నటించినట్టుంది. కానీ మీరా జాస్మిన్‌కు మాత్రం హిట్లు రాలేదు. దీంతో ఆమె సైడ్ అయిపోవాల్సి వచ్చింది. చివరగా ఆమె మళయాలం సినిమాలో కనిపించింది. మకల్ అనే సినిమాలో నటించింది. అయితే ఇప్పుడు మీరా జాస్మిన్ మాత్రం మంచి చాన్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ఇలా తన గ్లామర్ చూపిస్తూ ఫోటో షూట్లు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?

Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News