Sara Tendulkar: నైట్డేట్ స్టోరీతో సంచలనం రేపిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ముద్దుల తనయ..ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువతో మోడలింగ్ రంగంలో ప్రవేశించింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే అతని ముద్దుల తనయ సారా టెండూల్కర్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. ఈ మధ్యనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన నైట్డేట్ స్టోరీతో సంచలనం రేపిన సారా టెండూల్కర్ ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. సచిన్ టెండూల్కర్ ఆటతో అభిమానుల్ని సంపాదించుకుంటే..సారా తన అందంతో, అందమైన ఫోటోలతో ఫ్యాన్స్ హృదయాల్ని కొల్లగొడుతోంది. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
ఫ్యాషన్ డిజైనింగ్‌లో మంచి పట్టున్న స్టార్ కిడ్ సారా టెండూల్కర్(Sara Tendulkar) సోషల్ మీడియాలో తరచూ షేర్ చేసే ఫోటోలు, వీడియోలకు మంచి స్పందన లభిస్తోంది. ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన తరువాత ఇంగ్లండ్‌లోని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి మెడిసిన్ పూర్తి చేసింది. అయితే ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్ రంగాలపై మక్కువ పెంచుకుంది. ఆమె షేర్ చేసే వీడియోలు, ఫోటోలే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు కొత్తగా మోడలింగ్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ప్రముఖ దుస్తుల కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి విడుదలైన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సారా టెండూల్కర్‌తో పాటు అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ, సర్ధార్ ఉద్దమ్ సింగ్ ఫేమ్ బనితా సిందు, తానియా ష్రాప్లు ఉన్నారు.
కనికా కపూర్(Kanika Kapoor)తో ఇటీవల నైట్డేట్(Night Date)చేసినట్టుగా వచ్చిన వార్తలతో సారా టెండూల్కర్ సంచలనం రేపింది. ఆమె స్వయంగా విడుదల చేసిన కొన్ని ఫోటోల్లో సారా టెండూల్కర్ ఓ వ్యక్తి చేయి పట్టుకున్న ఫోటో చర్చనీయాంశమైంది. అటు యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్‌తో కూడా డేటింగ్లో ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook