SVP Mass Song: ఫ్యాన్స్‌కి మహేష్ బాబు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌.. అదేంటంటే!

SVP Mass Song on 7th May. 'మ‌మ‌ మ‌హేష' అంటూ సాగే మాస్‌ బీట్ లిరిక‌ల్ సాంగ్‌ను మే 7న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు  'సర్కారు వారి పాట' చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా వెల్ల‌డించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2022, 12:21 PM IST
  • మే 12న సర్కారు వారి పాట విడుదల
  • రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో
  • ఫ్యాన్స్‌కి మహేష్ బాబు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌
SVP Mass Song: ఫ్యాన్స్‌కి మహేష్ బాబు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌.. అదేంటంటే!

Mass Song MaMaMahesha release on 7th May form Sarkaru Vaari Paata: టాలీవుడ్ 'సూపర్‌ స్టార్‌' మహేశ్‌ బాబు, స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. సక్సెస్ ఫుల్ ఫ్యామిలీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఎస్‌వీపీ సినిమా మే 12న విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. 

'సర్కారు వారి పాట' ప్ర‌మోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం త‌ర‌చూ ఏదో ఒక అప్‌డేట్‌తో అభిమానుల అటెన్ష‌న్‌ను తిప్పుకుంటుంది ఇటీవలే ట్రైలర్ విడుదల చేసిన చిత్ర బృందం.. గురువారం ప్రీ రిలీజ్ వేడుక తేదీని కూడా ప్రకటించింది. ఈరోజు (మే 6) మహేష్ బాబు ఫ్యాన్స్‌కి మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 'మ‌మ‌ మ‌హేష' అంటూ సాగే మాస్‌ బీట్ లిరిక‌ల్ సాంగ్‌ను మే 7న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా వెల్ల‌డించింది. 'మైండ్ బ్లాక్' త‌ర‌హాలో ఈ సాంగ్ కూడ మాస్ స్టెప్స్‌తో ఉండ‌నున్న‌ట్లు ఇటీవల డాన్స్ మాస్టర్ శేఖ‌ర్ మాస్ట‌ర్‌ చెప్పాడు. 

మ‌హేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక‌ మే 7న యూస‌ఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ డెరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ రానున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వస్తున్నాయి. బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎస్‌వీపీ చిత్రంలో సముద్రఖని, నదియా, వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.  

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ఎస్‌వీపీ సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచింది. ముఖ్యంగా ట్రైలర్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. మహేశ్ బాబు డైలాగ్స్, ప‌రుశురాం టేకింగ్, వెన్నల కిషోర్ టైమింగ్ అందరిని అలరించాయి. 'గీతా గోవిందం' తర్వాత పరశురామ్ తెరకెక్కించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.   

Also Read: Pooja Hegde New Film: హ్య‌ట్రిక్ ఫ్లాప్‌లు పడ్డా త‌గ్గ‌ని పూజా హెగ్డే జోరు.. మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్!

Also Read:  Video: మళ్లీ మళ్లీ అదే సీన్... నిస్సహాయ స్థితిలో బిడ్డ మృతదేహాన్ని బైక్‌పై తరలించిన తండ్రి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News