Pongal 2024: సంక్రాంతి అనేది తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండుగ.రైతు రాజుగా తన పంటను ఇంటికి తెచ్చుకునే సమయాన్ని పురస్కరించుకొని జరుపుకునే ఈ పండుగ పలు పేర్లతో.. పలు రకాల పద్ధతులతో దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. పండగ పేరు.. పద్ధతులు ఒక్కో దగ్గర కొంచెం వేరుగా ఉన్న.. దాని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం అలాగే ఉంటుంది. మరి మనం సంక్రాంతి అని జరుపుకునే ఈ పండగను దేశంలో వేరు వేరు ప్రాంతాలలో ఏ పేరుతో ఎలా జరుపుకుంటారో ఒకసారి చూద్దాం..
మనం సంక్రాంతి అని పిలిచే ఈ పండుగను..పంజాబ్ లో ‘లోహ్రీ ఉత్సవ్’అని జరుపుకుంటారు. మనలాగే వీరు కొత్త బట్టలు ధరించి భోగి మంటలు వేసి నువ్వులతో చేసిన స్వీట్స్ తో పాటు బొరుగులను భోగి మంటలో వేస్తారు. రాత్రి అంతా భోగిమంటలో చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ సందడి చేస్తారు.
మహారాష్ట్రలో కూడా సంక్రాంతిని మాఘి సంక్రాంతి, హాల్దీ కుంకుమ్ ఉత్సవ్ అనే పేర్లతో జరుపుతారు. భోగికి ముందు రోజు ఇంటి ముందు ముగ్గు వేసి.. వాకిటికీ చెరుకు గడలు రేగి పండ్లు, చిలకాడ దుంపలు.. అలంకరించిన తరువాత.. చిన్న మట్టకుండా పెట్టి పూజ చేస్తారు. సంక్రాంతి సందర్భంగా వీరు పూజించే విట్టలుడి ఆలయాన్ని దర్శిస్తారు. హల్ది కుంకుమ్ ఉత్సవం రోజున ముత్తయిదువులు ఇరుగుపొరుగు స్త్రీలను ఇంటికి పిలిచి కొత్త పాత్రలో పసుపు కుంకుమ వాయినాలు ఇస్తారు.
రాజస్థానీయులు సంక్రాంతి పండుగను సుకరత్, సక్రాత్ గా ఘనంగా జరుపుకుంటారు. కొత్తగా పెళ్లయిన ఆడపడుచులు పుట్టింటికి వచ్చి పండుగ సందర్భంగా సందడి చేస్తారు.అస్సాంలో మాఘ్ బిహు లేక భోగలీ బిహూ గా సంక్రాంతిని జరుపుకుంటారు.
మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో సంక్రాంతి మనలాగే చాలా ఘనంగా పొంగల్ పేరుతో నిర్వహిస్తారు. ఆరోజు తమిళనాడులో కోడిపందాలు, పొట్టేలు పందాలుతో పాటు జల్లికట్టు వేడుకలు ఆకాశాన్ని అంటే విధంగా జరుగుతాయి.
ఇలా ఒక్కో ప్రాంతంలో సంక్రాంతిని వేరువేరు పేర్లతో ఘనంగా జరుపుకుంటారు. పండుగ పేరు ఏదైనా కానీ ..చేసుకునే పద్ధతులు వేరైనా కానీ.. మొత్తానికి ఇది రైతుల పండుగ. ఉద్యోగ రీత్యా ,చదువు రీత్యా,వేరువేరు కారణాల రీత్యా ,దూరంగా ఉన్న ఎందరో సొంత ఊరికి తిరిగి వచ్చే పండుగ. పిండి వంటలతో, పెట్టు పోతలతో కుటుంబ ఆత్మీయతకు నిదర్శనంగా నిలిచే పండుగ సంక్రాంతి.
Also Read: Devil Movie Review: కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ రివ్యూ.. బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter