'భరత్ అనే నేను' ఫస్ట్‌లుక్ పోస్టర్ అప్‌డేట్స్

కొరటాల శివ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమా ఫస్ట్‌లుక్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది.

Last Updated : Jan 16, 2018, 10:11 AM IST
 'భరత్ అనే నేను' ఫస్ట్‌లుక్ పోస్టర్ అప్‌డేట్స్

కొరటాల శివ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమా ఫస్ట్‌లుక్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు #MB24 First Oath On 26Jan పేరిట డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ పోస్టర్‌ని సైతం విడుదల చేసింది.

 

ఒక సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి భారీ సంఖ్యలో జనం హాజరైతే ఎలా వుంటుందో అటువంటి సన్నివేశాన్ని ప్రతిబింభించే విధంగా బ్యాగ్రౌండ్ చూపిస్తున్న ఫొటోపై "శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని.." అనేటటువంటి వాఖ్యాలు కనిపిస్తున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంలోని వాఖ్యాలన్నీ ఈ పోస్టర్‌పై ప్రముఖంగా కనిపించేలా పోస్టర్‌ని డిజైన్ చేశారు. 

అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సినిమా పేరు "భరత్ అనే నేను" అని స్పష్టంచేసేలా నిర్మాతలు పోస్టర్‌లో ఎక్కడా టైటిల్‌ని పేర్కొనకుండా కేవలం #MB24 అని మాత్రమే ట్వీట్ చేశారు. సినిమా పేరుపై మరింత ఆసక్తి రేకెత్తించేలా, అభిమానులని ఉత్కంఠకు గురిచేయడానికి డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ చేసిన ప్లాన్‌లో ఇది కూడా ఓ భాగం కావచ్చునేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Trending News