నవ్వు.. ఎన్నో సమస్యలకు, బాధలు, కష్టాలను మన నుంచి దూరం చేసే ఔషధం. అందుకే హాయిగా నవ్వితే మన కష్టాల నుంచి ఉపశమనం పొంది ఏదైనా ఉపాయం దొరుకుతుంది. అందుకే నవ్వు ప్రయోజనాలు తెలుసు కనుకే ప్రతి ఏడాది మే నెల తొలి ఆదివారాన్ని ప్రపంచ నవ్వుల దినోత్సవం (World Laughter Day)గా సెలబ్రేట్ చేసుకుంటారు. నవ్వు అనేది నాలుగు విధాల చేటు అనేది ఒకప్పటి మాట. నవ్వు నలభై విధాల మేలు అనేది నేటి మాట. బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!
నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సందేశాన్ని ఇచ్చారు. ఈ చిన్న జీవితంలో సాధారణంగా జీవిస్తూ, అందర్నీ ప్రేమిస్తూ ప్రతిరోజూ, ప్రతిక్షణం ఓ చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉండాలన్నారు. కుమారుడు గౌతమ్‌తో కలిసి సరదాగా నవ్వుతున్న ఫొటోను షేర్ చేశారు. ఈ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రిన్స్ మహేష్ Heloలో చేసిన సోషల్ పోస్ట్ వైరల్ అవుతోంది. క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
లాక్‌డౌన్ సమయంలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు చేస్తున్న విశేష సేవల్ని మహేష్ బాబు ప్రశంసించారు. కరోనాపై పోరాటానికి తన వంతు విరాళం అందజేశారు. సామాజిక బాధ్యతను నిర్వహించడంతో పాటు ఇంటివద్ద ఉంటున్న సూపర్ స్టార్ తన పిల్లలు గౌతమ్, సితారతో కలిసి సరదాగా గడుపుతున్నారు, వాటికి సంబంధించి ఫొటోలు సైతం తరచుగా షేర్ చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!