కార్ మెకానిక్ పాత్రలో నటిస్తున్న మహేష్ బాబు?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

Last Updated : Feb 16, 2018, 04:51 PM IST
కార్ మెకానిక్ పాత్రలో నటిస్తున్న మహేష్ బాబు?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో ఆయన కార్ మెకానిక్ పాత్రలో నటిస్తున్నారు అన్నది టాలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమాకి సంబంధించిన కథను ఇప్పటికే సందీప్ మహేష్‌కి చెప్పారని.. స్క్రిప్ట్ కూడా నచ్చడంతో మహేష్ ఓకే అన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘భరత్‌ అనే నేను’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమాకి కూడా ఆయన  సైన్ చేశారు. మరి ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి తీయబోయే సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న విషయంపై ఎలాంటి క్లారిటీ కూడా లేదు. గతంలో ‘అర్జున్‌రెడ్డి’ సినిమా తనకు బాగా నచ్చిందని చెబుతూ..మహేష్ ట్విటర్‌ ద్వారా సందీప్‌కి అభినందనలు చెప్పిన విషయం తెలిసిందే.

Trending News