మహేష్ బాబు నెక్స్ట్ మూవీ విశేషాలు...

Last Updated : Oct 17, 2017, 01:31 PM IST
మహేష్ బాబు నెక్స్ట్ మూవీ విశేషాలు...

'స్పైడర్' విజయంతో మంచి ఊపుమీదున్న మహేష్ బాబు మరో మూవీకి సిద్ధమౌతున్నాడు.  కొరటాల శివ డైరక్షన్‌లో తెరకెక్కుతున్న పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘భరత్ అనే నేను’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తరవాత హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిపీట్ అవుతున్న ఈ కాంబో, ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటుంది.అక్టోబర్ 14 న బిగిన్ అయిన ఈ షెడ్యూల్ లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్. 

కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కాంటెంపరరీ సోషల్ మెసేజ్ ను కూడా ఇంటరెస్టింగ్ మోడ్ లో ప్రెజెంట్ చేసే కొరటాల, ఈ సినిమాలో మహేష్ బాబును సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేయనున్నాడు. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా కైరా అద్వాని నటిస్తోంది. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తుండగా రాక్ స్టార్ డిఎస్‌పి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

Trending News