Sarkaru Vaari Paata movie OTT Release Date and OTT Platform: మే 12న విడుదలైన 'సర్కారు వారి పాట' చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో 'సూపర్ స్టార్' మహేశ్ బాబు హీరోగా నటించిన ఎస్‌వీపీ చిత్రంకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో.. రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. మహేశ్ స్వాగ్‌ను వెండితెరపై ఆస్వాదించేందుకు సినీ ప్రియులు థియేటర్లకు బారులు తీరుతున్నారు. విడుదలైన రెండు రోజుల్లోనే ఎస్‌వీపీ రూ.103 కోట్ల గ్రాస్‌ని సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది.
అయితే 'సర్కారు వారి పాట' చిత్రంకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎస్‌వీపీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం 'అమెజాన్ ప్రైమ్ వీడియోస్' సొంతం చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. అమెజాన్ భారీ మొత్తంలో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తయిన నాలుగు వారాల తర్వాత 'సర్కారు వారి పాట' సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంటే జూన్ రెండో వారంలో ఓటీటీలోకి రానుంది.
ఎస్‌వీపీ చిత్రం రెండు రోజుల్లోనే రూ. 103 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని మైత్రి మూవీ మేకర్స్ స్వయంగా ట్వీట్ చేసింది. 'ఈ వేసవి సూపర్‌స్టార్ స్వాగ్ సీజన్' అని కాప్షన్ ఇచ్చింది. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డు అని కూడా పేర్కొంది. తొలి రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి రీజనల్ సినిమాగా ఎస్‌వీపీ ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. యూఎస్‌లోనూ ఈ సినిమా దుమ్ము రేపుతోంది. ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిపోయింది.
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎస్‌వీపీ సినిమాను జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా.. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించారు. ఇక సముద్రఖని, నదియా, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: Sunil about F3 Movie : అందుకే 'ఎఫ్3'కి మళ్లీ మళ్లీ థియేటర్ వెళ్తారంటున్న సునీల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.