Maharagni Teaser Talk: కాజోల్, సంయుక్త మీనన్, ప్రభుదేవా పాన్ ఇండియా చిత్రం 'మహా రాగ్ని' టీజర్‌కు సూపర్ రెస్పాన్స్..

Maharagni Teaser Talk: కాజోల్‌ దేవ్‌గణ్, ప్రభుదేవా, సంయుక్త మీనన్ ముఖ్యపాత్రలో తెలుగువాడైన చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ప్యాన్ ఇండియా చిత్రం 'మహారాగ్ని'. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేసారు. ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 28, 2024, 09:05 PM IST
Maharagni Teaser Talk: కాజోల్, సంయుక్త మీనన్, ప్రభుదేవా పాన్ ఇండియా చిత్రం 'మహా రాగ్ని' టీజర్‌కు సూపర్ రెస్పాన్స్..

Maharagni Teaser Talk: కాజోల్ దేవ్‌గణ్ టైటిల్ రోల్లో ప్రభుదేవా, సంయుక్త మీనన్ నటించిన చిత్రం 'మహారాగ్ని'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను తెలుగు వాడైన చరణ్‌ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ స్టార్ క్యాస్టింగ్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో నసీరుద్దీన్ షా, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ నటించారు. తాజాగా విడుదలైన టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ ఫస్ట్ షార్ట్ నుంచి లాస్ట్ షార్ట్ వరకు తీవ్ర ఉత్కంఠతో సాగింది. ఈ టీజర్‌తో ప్రభుదేవా, సంయుక్త మీనన్, టైటిల్ పాత్రధాని కాజోల్ దేవ్‌గణ్ పాత్రలను పరిచయం చేసారు. ప్రభుదేవా స్వాగ్, యాక్షన్ సీక్వెన్సెస్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.  సంయుక్త మీనన్ చాలా ఇంటెన్స్ పాత్రలో నటిస్తున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే నసీరుద్దీన్ షా క్యారెక్టర్ ను కూడా రివీల్ చేశారు. ఇక చివరిగా డైనమిక్ లేడీ, బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ఎంట్రీ అదిరిపోయే లెవల్లో ఉంది.  జాతరలో ఫైట్ చేసే సీన్, తాను చెప్పే డైలాగ్ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మహా రాగ్ని క్వీన్ ఆఫ్ క్వీన్స్ ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ముఖ్యంగా టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు నిర్మాణ విలువలు బాగున్నాయి.  బాలీవుడ్ బాద్షా షారుఖాన్ నటించిన జవాన్ చిత్రానికి పనిచేసిన జీకే విష్ణు మహారాగ్ని చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ప్రతి ఫ్రేమ్ లో రిచ్‌గా ఉంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి మంచి  రీ రికార్డింగ్ ఇచ్చారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా కట్ చేసాడు ఎడిటర్ నవీన్ నూలి. ఆర్ట్ వర్క్ బాగుంది. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. కచ్చితంగా పాన్ ఇండియా ప్రేక్షకులు అలరించే విధంగా ఉంది.  త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరో మరో బిగ్ అప్డేట్ ఇవ్వనున్నారు.

కాజోల్, ప్రభుదేవా గతంలో 'మెరుపు కలలు' చిత్రంలో నటించారు. ఇపుడు దాదాపు 27 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వీళ్లిద్దరు మరోసారి ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. తాజాగా వీళ్లిద్దరు కలిసి నటిస్తోన్న 'మహారాగ్ని' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో  చూడాలి.

Also Read: Riyan Parag: చిక్కుల్లో క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌.. హీరోయిన్ల హాట్‌ వీడియోలు వెతుకుతూ రెడ్‌ హ్యాండెడ్‌గా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News