Lata Mangeshkar Telugu Songs: లతా మంగేష్కర్ పాడిన 2 తెలుగు పాటలూ సూపర్ హిట్టే

Lata Mangeshkar Telugu Songs: ఇండియా నైటింగేల్​ లతా మంగేష్కర్​ అనారోగ్యంతో నేడు తుదిశ్వాస విడిచారు. ఈ సమయంలో ఆమె స్మృతులను తలచుకుంటూ.. అమె పాడిన తెలుగు పాటలను గుర్తు చేసుకుందాం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2022, 03:00 PM IST
  • లెజెండరీ సింగర్​ లతా మంగేష్కర్​ కన్నుమూత
  • శోక సంద్రంలో సంగీత అభిమానులు
  • 36కుపైగా భాషల్లో పాటలు పాడిన మెలోడి క్వీన్​
Lata Mangeshkar Telugu Songs: లతా మంగేష్కర్ పాడిన 2 తెలుగు పాటలూ సూపర్ హిట్టే

Lata Mangeshkar Telugu Songs: లెంజెండరీ సింగర్​ లతా మంగేష్కర్​.. దాదాపు 80 ఏళ్ల పాటు భారత సినీ పరిశ్రమకు ఆమె ఎనలేని సేవ చేశారు. గత నెల కొవిడ్ సోకడం వల్ల ఆస్పత్రిలో చేరిన లతా మంగేష్కర్​.. చికిత్స పొందుతూ.. ఇవాళ (ఫిబ్రవరి 6 ఆదివారం) తుది శ్వాస విడించారు.

కోట్లాది మంది సంగీత ప్రియులు.. లతా మంగేష్కర్​ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.

మెలోడీ క్వీన్​గా, ఇండియన్​ నైటింగేల్​గా పేరు సంపాదించిన లతా మంగేష్కర్​.. భౌతికంగా ఈ లోకానికి విడిచి వెళ్లినప్పటికీ.. అమె పాటల రూపంలో ఎప్పటికీ శాస్వతంగా మిగిలిపోతారు.

లతా మంగేష్కర్ తన జీవితకాలంలో ఎక్కువగా బాలీవుడ్​ పరిశ్రమకు సేవ చేశారు. 1000కిపైగా బాలీవుడ్ సినిమాలకు ఆమె పాటలు పాడారు. ప్రాంతీయ పాటల విషయానికొస్తే.. 36 భాషల్లో ఎన్నో సూపర్​ హిట్​ సాంగ్స్​ పాడారామె.

తెలుగులో లతా మంగేష్కర్​ పాటలు ఇవే..

లెజెండరీ సింగర్​గా గుర్తింపు తెచ్చుకున్న లతా మంగేష్కర్​ తెలుగులో రెండు పాటలు మాత్రమే పాడినా.. ఆ రెండు సూపర్​ హిట్​ సాంగ్స్​ కావడం విశేషం.

లతా మంగేష్కర్​ మొదటి తెలుగు పాటు 65 ఏళ్ల క్రితం పాడారు. 1955లో  వచ్చిన సంతానం అనే సినిమాలో 'నిద్దుర పోరా తమ్ముడా' అనే సాంగ్​ను పాడించారు సంగీత దర్శకుడు సూసర్ల దక్షిణామూర్తి. ఇది చిన్న పిల్లలపై పాడిన లాలి పాట. ఈ పాటను ఇప్పటికీ ఎంతో మంది నిత్యం వింటుంటారు.

30 ఏళ్ల తర్వాత రెండో పాట..

తొలి పాట పాట పాడిన 30 ఏళ్ల తర్వాత మళ్లీ లతా మంగేష్కర్​ తెలుగు పాటను ఆలపించారు. 1988లో వచ్చిన 'ఆఖరి పోరాటం' అనే సినిమాలో.. 'తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో' అనే సాంగ్​ను పాడారు. ఈ సినిమాకు ఇళయరాజ సంగీతమందించారు. పాత పాటలకు సంబంధించి ఏదైన ఈవెంట్ ఉంటే అందులో ఈ పాట కచ్చితంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు.

ఈ రెండు సినిమాలకు మధ్య ఉన్న మరో పోలిక ఉన్న ఏమిటంటే.. 'సంతానం' అక్కినేని నాగేశ్వర్​ రావు (ఏఎన్​ఆర్) హీరో, సావిత్రి హీరోయిన్​. 'ఆఖరి పోరాటం' సినిమాలో అక్కినేని నాగార్జున హీరో, శ్రీదేవి హీరోయిన్​.

Also read: Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ నివాళి

Also read: Lata Mangeshkar: లతాకు పేరు తెచ్చిన పాట..చివరి పాట కూడా ఇండియన్ మిలట్రీపైనే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News