గీత గోవిందం పేరెత్తిన నెటిజెన్‌కి ఘాటుగా రిప్లై ఇచ్చిన లావణ్య త్రిపాఠి

సోషల్ మీడియా ప్రచారంపై ఘాటుగా స్పందించిన లావణ్య త్రిపాఠి

Last Updated : Aug 21, 2018, 08:01 PM IST
గీత గోవిందం పేరెత్తిన నెటిజెన్‌కి ఘాటుగా రిప్లై ఇచ్చిన లావణ్య త్రిపాఠి

అందాల రాక్షసి సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన లావణ్యా త్రిపాఠి ఖాతాలో ఆ తర్వాత దూసుకెళ్తా, సోగ్గాడే చిన్నినాయన, భలే భలే మగాడివోయ్ వంటి హిట్ సినిమాలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత ఆమె సినిమాలేవీ పెద్దగా హిట్ అవలేదు. అయితే, ఇటీవల గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆమె గురించి సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేశాయి. ఈ ఏడాది సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న తొలిప్రేమ, గీత గోవిందం సినిమాల్లో హీరోయిన్‌గా చేసే అవకాశం లావణ్యా త్రిపాఠినే వరించినప్పటికీ.. ఆమె ఆ చిత్రాలను తిరస్కరించిందనేది ఆ పుకార్ల సారాంశం. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ రూమర్స్ చూసి.. చూసి లావణ్యా త్రిపాఠికి చిర్రెత్తుకొచ్చింది. ఇంకేం.. వెంటనే ఓ ట్విటర్ యూజర్‌కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుందామె. 

 

 

తాను నిశబ్ధంగా ఉన్నానంటే దానికి అర్థం ఎవరు ఏమన్నా చూస్తూ ఊరుకుంటానని కాదు అంటూ నవ్వూతూనే ఆ యూజర్‌కి ఘాటైన రిప్లై ఇచ్చిందామె. అంతేకాకుండా ఆ పుకార్లలో నిజం లేదని చెబుతూ దానిని ఓ ఫేక్‌న్యూస్‌గా కొట్టిపారేసింది. 

 

 

Trending News