Karnataka Ratna Award 2021: మరణాంతరం పునీత్ కు అరుదైన గౌరవం.. ‘కర్ణాటక రత్న’ అవార్డుకు ఎంపిక చేసిన రాష్ట్రప్రభుత్వం

Karnataka Ratna Award 2021: గుండెపోటుతో ఇటీవలే తుదిశ్వాస విడిచిన కన్నడ స్టార్​ హీరో పునీత్​ రాజ్​కుమార్​కు ఆ రాష్ట్ర అత్యున్నత పురస్కారంతో సత్కరించనుంది. 'కర్ణాటక రత్న' అవార్డును కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2021, 09:16 AM IST
    • దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు అరుదైన గౌరవం
    • ‘కర్ణాటక రత్న’ అవార్డుకు పునీత్ ను ఎంపిక చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం
    • పునీత్ సంస్మరణ సభలో అధికారంగా వెల్లడించిన సీఎం బసవరాజు బొమ్మై
Karnataka Ratna Award 2021: మరణాంతరం పునీత్ కు అరుదైన గౌరవం.. ‘కర్ణాటక రత్న’ అవార్డుకు ఎంపిక చేసిన రాష్ట్రప్రభుత్వం

Karnataka Ratna Award 2021: కన్నడ పవర్​ స్టార్​ పునీత్​ రాజ్​ కుమార్​ మరణం (puneeth rajkumar death) తర్వాత.. అతడికి అరుదైన గౌరవం లభించింది. ఆ రాష్ట్రంలో అత్యున్నత పురస్కారమైన 'కర్ణాటక రత్న' అవార్డు (karnataka ratna award) ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు. 'పునీత్​ నమన' (పునీత్​కు వందనం) పేరుతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పునీత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. చాలామందితో సమాలోచనలు చేసిన తరువాత పునీత్​కు కర్ణాటక అత్యున్నత పురస్కారమైన కర్ణాటక రత్నను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

”పునీత్, మా అందరికీ ఇష్టమైన నటుడు.. పునీత్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. కర్ణాటక నుంచి బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏకైక బాలుడు పునీత్. తన చిన్నతనం నుంచే అద్భుతంగా నటించేవాడు. ఇంత చిన్న వయసులో అలా నటించడం అంత సులువు కాదు’’ అని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.

భారతరత్న జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారం అయితే.. ‘కర్ణాటక రత్న’ ఆ రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పురస్కారం. రాష్ట్ర స్థాయిలో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును అందజేస్తారు. ‘కర్ణాటక రత్న’ అవార్డును 1992లో స్థాపించారు. వీరిలో ఎనిమిది మందికి మాత్రమే కర్ణాటక రత్న అవార్డు లభించింది. మరణానంతరం ఈ అవార్డును అందుకున్న 10వ వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. అవార్డుతోపాటు బహుమతిలో 50 గ్రాముల బంగారు పతకం, ప్రశంసా పత్రం అందిస్తారు. 

Also Read: Nithiins Macherla Niyojakavargam : నితిన్‌ మాచర్ల నియోజకవర్గం నుంచి మరో అప్‌డేట్

Also Read: Ram Asur Movie: పబ్లిక్ ఏరియాల్లో వాల్ పోస్టర్స్ అంటించిన హీరో, హీరోయిన్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

 

Trending News