Lata Mangeshkar health update: లతా మంగేష్కర్ హెల్త్ అప్డేట్.. ఇంకా ఐసీయూలోనే!

Lata Mangeshkar health update: కరోనాతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె కుటుంబ సభ్యులు ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారని.. ప్రస్తుతం ఆమె నెమ్మదిగా కోలుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 03:52 PM IST
    • ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లతా మంగేష్కర్
    • ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని వైద్యుల ప్రకటన
    • లత నెమ్మదిగా కోలుకుంటుందని కుటుంబసభ్యులు వెల్లడి
Lata Mangeshkar health update: లతా మంగేష్కర్ హెల్త్ అప్డేట్.. ఇంకా ఐసీయూలోనే!

Lata Mangeshkar health update: ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె కుటుంబ సభ్యులు ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం లతా మంగేష్కర్‌కు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 

లతా మంగేష్కర్ ప్రస్తుతం ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని.. వైద్యానికి ఆమె కొద్దిగా స్పందిస్తున్నట్లు వైద్యులు తెలిపారని ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వెంటిలేటర్ లేకుండా ఆమె ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ (జనవరి 27) ఉదయం కొంచెం సేపు వైద్యులు వెంటిలేటర్ తొలగించారు.

ప్రస్తుతం లతా మంగేష్కర్ కొద్దిగా కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. డాక్టర్ ప్రతీత్ సందానీ నేతృత్వంలోని వైద్యబృందం లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తుందని తెలిపారు. లతా మంగేష్కర్ కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ, ఆమె కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఈ నెల 8న కరోనా బారిన పడిన గాయకురాలు లతా మంగేష్కర్.. ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మధ్యలో ఓసారి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించిందని ప్రచారం జరిగినా, ఆమె కుటుంబ సభ్యులు ఖండించారు. దీంతో లతా మంగేష్కర్ ఆరోగ్య వివరాలను ఆసుపత్రి వర్గాలు క్రమం తప్పకుండా వెల్లడిస్తున్నాయి.  

Also Read: Nagarjuna on Samantha Divorce: సమంతపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు.. నాగచైతన్యతో విడాకులపై స్పందన

Also Read: Mouni Roy Wedding Pics: ప్రియుడ్ని పెళ్లాడిన నాగిని హీరోయిన్.. మౌనీరాయ్ పెళ్లి ఫొటోలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News